News October 5, 2025
ఐదేళ్లలో కేజీ వెండి ధర రూ.3లక్షలు?

వెండి ధరలు కేవలం గడిచిన ఏడాదిలోనే 54% పెరిగాయి. పారిశ్రామిక రంగంలో, ముఖ్యంగా సోలార్ ప్యానల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలలో సిల్వర్‌కు డిమాండ్ పెరగడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇదిలాగే కొనసాగితే అతి త్వరలోనే కేజీ వెండి ధర రూ.2లక్షలు, ఐదేళ్లలో మూడు లక్షలకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇన్వెస్టర్లు బంగారం, వెండిని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నట్లు వెల్లడించారు.
Similar News
News April 4, 2026
పోలింగ్ రోజున వారికి సెలవు.. TG ప్రభుత్వం

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్లే ఓటర్లకు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఫ్యాక్టరీలు, షాపులు, కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు జీతంతో కూడిన సెలవు ఇవ్వాలని ఆదేశించింది. అస్సాం, కేరళం, పుదుచ్చేరి ఎంప్లాయీస్‌కు ఏప్రిల్ 9న, తమిళనాడు ఓటర్లకు 23న, WBకు చెందిన ఉద్యోగులకు ఏప్రిల్ 23, 29న సెలవులు ఉంటాయని తెలిపింది. పుదుచ్చేరి(యానాం), TN ఓటర్లకు ఏపీ కూడా <<19553642>>పెయిడ్ లీవ్<<>> ఇచ్చింది.

రైలు వ్యవస్థలే టార్గెట్.. ఉగ్రముఠా అరెస్టు

దేశంలో రైల్వే వ్యవస్థలే టార్గెట్‌గా దాడులకు కుట్ర చేస్తున్న ఉగ్ర ముఠాను UP పోలీసులు అరెస్టు చేశారు. ISIతో సంబంధమున్న మీరఠ్‌కు చెందిన కీలక నిందితుడు సాకిబ్ అలియాస్ డెవిల్‌తో సహా నలుగురిని కస్టడీలోకి తీసుకున్నారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించి, పెను ప్రమాదం జరిగేలా వీళ్లు ప్లాన్ చేసినట్లు గుర్తించారు. లక్నో రైల్వే స్టేషన్ సమీపంలో సిగ్నల్ బాక్స్‌ను లక్ష్యంగా చేసుకున్నారని అధికారులు తెలిపారు.