News October 5, 2025

ప్రకాశం: 9 పేకాట స్థావరాలపై దాడులు.. 55 మంది అరెస్ట్

image

జిల్లాలో ఆదివారం 9 పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి 55 మందిని పేకాటరాయుళ్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఒంగోలు తాలూకా, ఎస్ఎన్ పాడు, ఎస్ కొండ, జరుగుమల్లి, మర్రిపూడి, మార్కాపురంలలో పేకాట స్థావరాల నుంచి రూ. 93,630 నగదు, ఎస్ కొండలో కోళ్ల పందెం రాయుళ్ల వద్ద రూ. 1,27,800 నగదును స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News April 2, 2026

ప్రకాశం: కూతురి అసభ్యకర ఫొటోలు, వీడియోలు తండ్రికి పంపి..

image

ప్రకాశం(D), జరుగుమల్లి(M) గంగరాజుపాలేనికి చెందిన అశోక్ కుమార్ మూడేళ్ల క్రితం నెల్లూరుకు బేల్దారి పనుల కోసం వచ్చాడు. ఈక్రమంలో ఓ బాలికకు మాయమాటలు చెప్పి అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు తీశాడు. అశోక్ కుమార్ ఆ బాలిక తండ్రికి రూ.60 వేలు ఇవ్వాల్సి ఉండడంతో ఆయన నిలదీశాడు. దీంతో బాలిక ఫొటోలు, వీడియోలు తండ్రికి పంపాడు. కేసు రుజువు కావడంతో నిందితుడికి కోర్టు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.9 వేల ఫైన్ విధించింది.

News April 2, 2026

కొత్తపట్నంలో JC ఆకస్మిక తనిఖీలు

image

ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి కొత్తపట్నం మండలం పల్లెపాలెం గ్రామంలోని ప్రేమానంద బాలుర హోంను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలలతో మాట్లాడి వారి స్థితిగతులు తెలుసుకున్నారు. హోంలో సౌకర్యాలు పరిశీలించి సూచనలు ఇచ్చారు. బాలల సంక్షేమ కమిటీ ఆదేశాలు తప్పనిసరి అని తెలిపారు. విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సేవలపై సిబ్బందిని అభినందించారు.