News October 5, 2025
ఇద్దరి యువకుల ప్రాణాలను కాపాడిన పోలీసులు

సూర్యలంక సముద్ర తీరంలో కొట్టుకుపోతున్న ఇద్దరు యువకుల ప్రాణాలను పోలీస్ సిబ్బంది, గజఈతగాళ్లు ఆదివారం రక్షించారు. స్థానికుల వివరాల మేరకు.. తెలంగాణకు చెందిన బొడ్డు శ్రీను, కొట్టుల విగ్నేష్ అలల్లో కొట్టుకుపోయారు. గమనించిన పోలీసులు, మెరైన్ సిబ్బంది వారిని కాపాడారు. ఎస్పీ బి.ఉమామహేశ్వర్ సిబ్బందిని అభినందించారు. యాత్రికులు పోలీసుల సూచనలు పాటించి సురక్షితంగా విహరించాలని సూచించారు.
Similar News
News March 21, 2026
ముస్లింల వస్తువులు వద్దన్నారు.. క్రూడాయిల్ ఎందుకు కొంటున్నారు: అసద్

TG: దేశంలోని పలు రాష్ట్రాల్లో ముస్లింలు తయారుచేసే వస్తువులు కొనవద్దని తీర్మానం చేసిన బీజేపీ అరబ్ దేశాల నుంచి క్రూడాయిల్ ఎందుకు కొనుగోలు చేస్తోందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ప్రధాని మోదీ విదేశాలకు వెళ్లి భారత్‌లో అన్ని వర్గాల కోసం పని చేస్తున్నామని చెప్తుండటం పచ్చి అబద్ధమన్నారు. దేశంలో గ్యాస్, పెట్రోలియం కొరత ఉన్నా అలాంటిదేం లేదని చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.
News March 21, 2026
BREAKING: కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే మృతి

కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే వున్నం హనుమంతరాయ చౌదరి శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. టీడీపీలో సుదీర్ఘ కాలం పనిచేసిన హనుమంతరాయ చౌదరి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
News March 21, 2026
పోలవరం జిల్లా మొదటి కలెక్టర్ ఈయనే..!

పోలవరం జిల్లా నూతన కలెక్టర్‌గా దినేశ్ కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయుష్ డైరెక్టర్‌గా ఉన్న ఆయన, ఇకపై పోలవరం జిల్లా బాధ్యతలు చేపట్టనున్నారు. జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి అల్లూరి జిల్లా కలెక్టర్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తుండగా, ఇప్పుడు దినేశ్ కుమార్ మొదటి పూర్తిస్థాయి కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.


