News October 5, 2025
ముంచే ముప్పు.. ముందే తెలుసుకోలేమా..?

దేశంలో కొండచరియలు విరిగిపడి ఏటా వందలాది మంది చనిపోతున్నారు. ఇవాళ నేపాల్‌లో 51 మంది, డార్జిలింగ్‌లో 18 మంది బలయ్యారు. దీంతో ల్యాండ్‌స్లైడ్స్ ముప్పును ముందే తెలుసుకోలేమా అనే చర్చ నడుస్తోంది. వెదర్ అలర్ట్స్ వ్యవస్థల్లాగే వీటిని హెచ్చరించే సిస్టమ్‌ను NDMA, GSI, NLRMS అభివృద్ధి చేశాయి. సిక్కిం, కేరళ, ఉత్తరాఖండ్‌లో ప్రస్తుతం ట్రయల్స్‌లో ఉన్న సిస్టమ్ విజయవంతమైతే ముప్పు నుంచి ప్రజల్ని తప్పించవచ్చు.
Similar News
News October 6, 2025
AUS-Aపై IND-A విజయం.. సిరీస్ కైవసం

ఆస్ట్రేలియా-Aతో జరిగిన అన్‌అఫీషియల్ మూడో వన్డేలో ఇండియా-A 2 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత AUS 317 రన్స్‌కు ఆలౌటైంది. అర్ష్‌దీప్, హర్షిత్ రాణా చెరో 3 వికెట్లు, బదోని 2 వికెట్లు తీశారు. అనంతరం IND 46 ఓవర్లలో టార్గెట్‌ను ఛేదించింది. ప్రభ్‌సిమ్రాన్ (102), శ్రేయస్ (62), రియాన్ పరాగ్ (62) రాణించారు. తిలక్ (3), అభిషేక్ (22) నిరాశపరిచారు. ఈ విజయంతో 3 మ్యాచుల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో సొంతం చేసుకుంది.
News October 6, 2025
అక్టోబర్ 6: చరిత్రలో ఈరోజు

1860: భారతీయ శిక్షాస్మృతి చట్టమైన రోజు
1892: ఆంగ్ల కవి అల్ఫ్రెడ్ టెన్నిసన్ మరణం
1927: ప్రపంచంలో తొలి టాకీ చిత్రం ‘ది జాజ్ సింగర్’ అమెరికాలో విడుదల
1932: భారత భౌతిక శాస్త్రవేత్త గణేశన్ వెంకటరామన్ జననం
1946: బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా జననం (ఫొటోలో)
1963: హైదరాబాద్‌లో నెహ్రూ జూపార్క్ ప్రారంభం
1967: తెలుగు సినీ దర్శకుడు సి.పుల్లయ్య మరణం
News October 6, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.