News October 5, 2025

బంకుల్లో ఇవి ఫ్రీ.. లేదంటే ఫిర్యాదు చేయండి

image

పెట్రోల్ బంకుల్లో ఫ్రీగా వాటర్, టాయ్‌లెట్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్, టైర్లకు గాలి అందించాలి. ఫ్యూయల్‌పై డౌట్ ఉంటే కస్టమర్ కొలత, క్వాలిటీ చెక్ ఎక్విప్‌మెంట్ అడగవచ్చు. చాలాచోట్ల నీళ్లుండవు, మూత్రశాలలు దుర్గంధంతో వాడలేము. ఇక టైర్లలో ఎయిర్‌కు చిల్లర డిమాండ్ చేసే స్థాయికి చేరింది. మీరూ ఈ సమస్య ఎదుర్కొంటే ఫిర్యాదు చేయొచ్చు. BPCL-1800224344, HPCL-18002333555, IOCL-1800233355, రిలయన్స్-18008919023.
Share It

Similar News

News October 6, 2025

₹300Cr క్లబ్‌లోకి ‘లోక: ఛాప్టర్-1’.. OTTలోకి ఎప్పుడంటే?

image

కళ్యాణి ప్రియదర్శన్, నస్లేన్ నటించిన ‘లోక: ఛాప్టర్-1’ సినిమా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు సినీ వర్గాలు తెలిపాయి. దీంతో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ సాధించిన మలయాళ సినిమాగా రికార్డు సృష్టించింది. తెలుగులో ‘కొత్త లోక’ పేరుతో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. దీపావళి కానుకగా OTTకి రాబోతున్నట్లు తెలుస్తోంది. జియో హాట్‌స్టార్‌లో ఈ నెల 20 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.

News October 6, 2025

AUS-Aపై IND-A విజయం.. సిరీస్ కైవసం

image

ఆస్ట్రేలియా-Aతో జరిగిన అన్‌అఫీషియల్ మూడో వన్డేలో ఇండియా-A 2 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత AUS 317 రన్స్‌కు ఆలౌటైంది. అర్ష్‌దీప్, హర్షిత్ రాణా చెరో 3 వికెట్లు, బదోని 2 వికెట్లు తీశారు. అనంతరం IND 46 ఓవర్లలో టార్గెట్‌ను ఛేదించింది. ప్రభ్‌సిమ్రాన్ (102), శ్రేయస్ (62), రియాన్ పరాగ్ (62) రాణించారు. తిలక్ (3), అభిషేక్ (22) నిరాశపరిచారు. ఈ విజయంతో 3 మ్యాచుల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో సొంతం చేసుకుంది.

News October 6, 2025

అక్టోబర్ 6: చరిత్రలో ఈరోజు

image

1860: భారతీయ శిక్షాస్మృతి చట్టమైన రోజు
1892: ఆంగ్ల కవి అల్ఫ్రెడ్ టెన్నిసన్ మరణం
1927: ప్రపంచంలో తొలి టాకీ చిత్రం ‘ది జాజ్ సింగర్’ అమెరికాలో విడుదల
1932: భారత భౌతిక శాస్త్రవేత్త గణేశన్ వెంకటరామన్ జననం
1946: బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా జననం (ఫొటోలో)
1963: హైదరాబాద్‌లో నెహ్రూ జూపార్క్ ప్రారంభం
1967: తెలుగు సినీ దర్శకుడు సి.పుల్లయ్య మరణం