News October 5, 2025

కాకినాడ: ప్రశాంతంగా ఏపీపీ రాత పరీక్ష

image

అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల (ఏపీపీ) పోస్టుల నియామకానికి సంబంధించిన రాత పరీక్షలు ఆదివారం జేఎన్టీయూ కళాశాల కేంద్రంలో ప్రశాంత వాతావరణంలో జరిగాయని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. పరీక్షకు మొత్తం 272 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా, 212 మంది మాత్రమే హాజరయ్యారని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ వివరించారు.

Similar News

News October 6, 2025

పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌.. భారత్‌కు 22 మెడల్స్

image

ఢిల్లీలో వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ పోటీలు ముగిశాయి. భారత్ 22 పతకాలను (6 గోల్డ్, 9 సిల్వర్, 7 బ్రాంజ్) గెలుచుకుంది. పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఇండియాకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. కాగా ఈ ఛాంపియన్‌షిప్‌‌లో 100కు పైగా దేశాల నుంచి 2,200 మందికి పైగా అథ్లెట్లు పోటీ పడ్డారు. ఖతార్, UAE, జపాన్ తర్వాత వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించిన నాలుగో ఆసియా దేశంగా IND నిలిచింది.

News October 6, 2025

ఆసిఫాబాద్‌లో స్థానిక ఎన్నికల్లో వర్గ పోరు

image

కాంగ్రెస్ పార్టీ నుంచి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. ASFలో కాంగ్రెస్ వర్గ పోరు కొనసాగుతుండటంతో ఆశావహులకు ఎదురుదెబ్బ తగలక తప్పదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. డీసీసీ అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ ఒక వర్గమైతే.. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ శ్యాంనాయక్ మరో వర్గం. ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలకు రెండు వర్గాల నాయకులు ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

News October 6, 2025

₹300Cr క్లబ్‌లోకి ‘లోక: ఛాప్టర్-1’.. OTTలోకి ఎప్పుడంటే?

image

కళ్యాణి ప్రియదర్శన్, నస్లేన్ నటించిన ‘లోక: ఛాప్టర్-1’ సినిమా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు సినీ వర్గాలు తెలిపాయి. దీంతో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ సాధించిన మలయాళ సినిమాగా రికార్డు సృష్టించింది. తెలుగులో ‘కొత్త లోక’ పేరుతో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. దీపావళి కానుకగా OTTకి రాబోతున్నట్లు తెలుస్తోంది. జియో హాట్‌స్టార్‌లో ఈ నెల 20 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.