News October 5, 2025
నాంపల్లి: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సమీక్ష

ప్రజాభవన్‌లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఏఐసీసీ ఇన్‌ఛార్జీ మీనాక్షి నటరాజన్ హాజరై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ ఉపఎన్నికను టీపీసీసీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందన్నారు. ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై ఆమె సూచనలు చేశారు.
Similar News
News March 22, 2026
HYD: ముంచుకొస్తోంది.. జర జాగ్రత్త!

వేసవి దృష్ట్యా HYDలో ఒక్కపూట బడులు సాగుతున్నాయి. ఈ గ్యాప్‌లో పిల్లలు సరదాగా ఈతకు వెళ్తుంటారు. ఒక్కోసారి ఈసరదా వెంటే విషాదం పొంచి ఉండే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. హైదరాబాదీలు గతేడాది 8 మంది లోతు తెలియక, ప్రవాహ తాకిడికి మునిగిపోయారు. వేసవిలో రోజుకు నలుగురి చొప్పున ఈత సరదాకు బలయ్యారని గణాంకాలు చెబుతున్నాయి. పెద్దలు, నిపుణుల సమక్షంలో పిల్లలకు ఈత నేర్పండి.
News March 22, 2026
HYDలో నేటి నుంచి బంద్

నగరవాసులను నెలరోజులుగా ఆకట్టుకున్న నైట్ బజార్ నేటి నుంచి ఉండదిక. శనివారం పాతబస్తీలో అక్కడక్కడా కనిపించినా నేటి నుంచి 24Hrs షాపింగ్‌కు తెరపడనుంది. లాడ్ బజార్‌లో గాజులు, చార్మినార్ ముందు అత్తరు, ఖర్జూరాలు, డ్రైఫ్రూట్స్ కోసం నైట్ బజార్‌కు పోటెత్తారు. మొహబ్బత్ కా షర్బత్, కబాబ్స్, పత్తర్ కా ఘోష్ బాగా సేల్ అయ్యాయని నిర్వాహకులు చెబుతుతున్నారు. గ్యాస్ కొరత ఉన్నా.. హలీం,బిర్యానీ సప్లై తగ్గలేదని ఫుడీస్ మాట.
News March 22, 2026
HYD: రేపటి నుంచి లైఫ్ ట్యాక్స్ రద్దు

అదనపు వాహనాలు కొనుగోలు చేసే వారికి పడే 2% లైఫ్ ట్యాక్స్‌ను ఈ నెల 23 నుంచి రద్దు చేస్తున్నట్లు HYDలోని అధికారులు తెలిపారు. ఈ మేరకు వాహన్ పోర్టల్ అందుబాటులోకి రానుందని అన్నారు. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పోర్టల్‌ను ప్రారంభిస్తారని దీని ద్వారా దేశంలో ఉన్న అన్ని వాహనాల వివరాలు ఒకే గొడుగు కిందికి రానున్నాయని వెల్లడించారు. 2% పన్ను ఎత్తివేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
# SHARE IT


