News October 5, 2025
అనకాపల్లి: జీఎస్టీ పాత కొత్త ధరల బోర్డులు ఏర్పాటు చేయాలి

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జీఎస్టీపాత, కొత్త ధరల వివరాలతో ప్రతి వ్యాపార సంస్థ బోర్డులు ఏర్పాటు చేయాలని కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాండ్రేగుల వెంకటరమణ డిమాండ్ చేశారు. ఆదివారం జీఎస్టీ తగ్గింపు-ప్రయోజనాలపై అనకాపల్లిలో వినియోగదారుల సంఘాల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు క్షేత్రస్థాయిలో వినియోగదారులకు అందడం లేదన్నారు.
Similar News
News March 20, 2026
జగిత్యాల: జనగణన పకడ్బందీగా నిర్వహించాలి

జిల్లాలో జనగణన కార్యక్రమాన్ని అత్యంత ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత, రాజా గౌడ్ అధికారులను ఆదేశించారు. జనగణన-2027లో భాగంగా మొదటి దశలో చేపట్టనున్న ‘హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సెస్’పై అధికారులకు నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణ శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శిక్షణలో నేర్చుకున్న ప్రతి అంశాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయాలన్నారు.
News March 20, 2026
కాంగ్రెస్‌ది చోర్ విధానం: హరీశ్ రావు

TG: కాంగ్రెస్ హయాంలో తలసరి ఆదాయం, GSDP తగ్గిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ‘కాంగ్రెస్‌ది క్యూర్, ప్యూర్, రేర్ విధానం కాదు.. చోర్ విధానం. 6 గ్యారంటీలు అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. BRS హయాంలో తలసరి ఆదాయ వృద్ధి 12.1% ఉంటే ఇప్పుడు 10.2%గా ఉంది. కాంగ్రెస్ వైఫల్యం వల్లే ఇది తగ్గింది. బడ్జెట్ ద్వారా ఈ ప్రభుత్వ చేతగానితనం అర్థమైంది’ అని ప్రెస్‌మీట్‌లో ఫైరయ్యారు.
News March 20, 2026
సంగారెడ్డి: ఈనెల 28, 29న స్పోర్ట్స్ హకథాన్

హైదరాబాద్ గచ్చిబౌలిలో ఈనెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్న ‘స్పోర్ట్స్ హకథాన్’ వాల్ పోస్టర్లను జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి సంగారెడ్డిలో ఆవిష్కరించారు. జిల్లాలోని క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐటీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఉషయ్య తదితరులు పాల్గొన్నారు.


