News April 7, 2024

నేడు అనకాపల్లిలో పవన్ కళ్యాణ్ రోడ్ షో

image

AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి యాత్రలో భాగంగా ఇవాళ అనకాపల్లి రానున్నారు. సా.3:30 గంటలకు హెలికాప్టర్‌లో అనకాపల్లికి చేరుకుంటారు. హెలీప్యాడ్ వద్ద నుంచి పలు కూడళ్ల మీదుగా నెహ్రు చౌక్ జంక్షన్ వరకూ రోడ్డు షో నిర్వహిస్తారు. అనంతరం సా.4 గంటలకు వారాహి వాహనం మీద నుంచి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.

Similar News

News November 5, 2025

ఫ్రీ బస్సు హామీ.. న్యూయార్క్‌లో విజయం

image

న్యూయార్క్ (అమెరికా) మేయర్‌గా <<18202940>>మమ్‌దానీ గెలవడంలో<<>> ఉచిత సిటీ బస్సు ప్రయాణ హామీ కీలకపాత్ర పోషించిందని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే బస్ లేన్స్, వేగం పెంచుతానని ఆయన హామీ ఇచ్చారు. వాటితో పాటు సంపన్నులు, కార్పొరేట్లపై పన్నులు పెంచి ఉద్యోగులపై ట్యాక్సులను తగ్గిస్తామని చెప్పారు. నగరంలో ఇంటి అద్దెలను కంట్రోల్ చేస్తామని హామీ ఇవ్వడం ఓటర్లను ఆకర్షించింది.

News November 5, 2025

‌ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

image

<>ఇండియన్ బ్యాంక్‌<<>> 6 ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 21వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ(ఫైర్), బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ/ రాత పరీక్ష/గ్రూప్ డిస్కషన్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, దివ్యాంగులకు రూ.175. వెబ్‌సైట్: https://indianbank.bank.in

News November 5, 2025

వరి కోత అనంతరం తీసుకోవలసిన జాగ్రత్తలు

image

వరిని నూర్చేటప్పుడు వేర్వేరు రకాల ధాన్యం కలవకుండా జాగ్రత్త పడాలి. నూర్చిన ధాన్యాన్ని శుభ్రంగా తూర్పారబోసి చెత్త, తాలు, మట్టి బెడ్డలను ఏరేయాలి. చౌడు నేలల్లో పండించిన ధాన్యాన్ని, చీడపీడలు ఆశించి రంగు మారిన ధాన్యాన్ని మంచి ధాన్యంతో కలపకూడదు. తూర్పార బెట్టిన ధాన్యంలో మట్టి గడ్డలు, గడ్డి, కలుపు విత్తనాలు, మొక్కల అవశేషాలు లేకుండా చూడాలి. ఇలా శుభ్రం చేసిన ధాన్యం ఎక్కువ కాలం నిల్వ ఉండి మంచి ధర వస్తుంది.