News October 6, 2025
మస్క్ ట్వీట్! NETFLIXకు ₹2 లక్షల కోట్ల నష్టం

ఎలాన్ మస్క్ చేసిన Cancel Netflix for the health of your kids ట్వీట్‌తో నెట్‌ఫ్లిక్స్ ₹2 లక్షల కోట్లు నష్టపోయింది. USA స్టాక్ మార్కెట్లో సంస్థ విలువ 5 రోజుల్లో $514Bn నుంచి $489Bnకి పడిపోయింది. ఆ సంస్థ 2023లో ఆపేసిన వివాదాస్పద యానిమేటెడ్ సిరీస్ Dead End: Paranormal Park క్లిప్స్ కొన్ని ఇటీవల వైరలయ్యాయి. దీంతో టీనేజర్‌ను ట్రాన్స్‌జెండర్‌గా చూపే కంటెంట్‌తో పిల్లలు తప్పుదోవ పడతారని మస్క్ మండిపడ్డారు.
Similar News
News October 6, 2025
శివుణ్ని ఏ సమయంలో దర్శించుకోవాలి?

పరమేశ్వరుని ఆలయానికి సాయంత్రం వెళ్లడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. ఆ సమయంలో శివ లింగాన్ని దర్శించుకుంటే శుభం కలుగుతుందని అంటున్నారు. రోజు పూర్తయ్యే సమయంలో ఆ లయకారుణ్ని దర్శించుకోవడం వల్ల రెట్టింపు ఫలితం ఉంటుందని చెబుతున్నారు. ఎలాంటి తొందరపాటు లేకుండా, ప్రశాంతంగా, నెమ్మదిగా భగవంతుణ్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని సూచిస్తున్నారు. <<-se>>#DharmaSandehalu<<>>
News October 6, 2025
‘అన్నమయ్య’ లాంటి సినిమా చేయాలని ఉంది: నాగచైతన్య

తనకు అన్నమయ్య, శ్రీ రామదాసు లాంటి సినిమాలు చేయాలని ఉందని నాగచైతన్య తెలిపారు. నాగార్జున నటించిన ‘నిన్నే పెళ్లాడతా’, వెంకటేశ్ ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమాలను బోర్ అనేదే లేకుండా 100 సార్లు చూస్తానని ఓ TVలో షోలో చెప్పారు. ప్రస్తుతం ఆయన ‘విరూపాక్ష’ డైరెక్టర్ కార్తీక్ దండుతో ఓ మూవీ చేస్తున్నారు. దీనికి ‘వృషకర్మ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది.
News October 6, 2025
H-1B వీసా ఫీజు పెంపును సమర్థించిన NVIDIA CEO

US అధ్యక్షుడు ట్రంప్ H-1B వీసాల ఫీజును లక్ష డాలర్లకు పెంచడాన్ని NVIDIA కంపెనీ సీఈవో జెన్సన్ హువాంగ్ సమర్థించారు. ఇది ఇమిగ్రెంట్ పాలసీని రీషేప్ చేస్తుందని అన్నారు. ‘ఏ దేశానికి లేని బ్రాండ్ రెపుటేషన్ USకి ఉంది. అదే “ది అమెరికన్ డ్రీమ్”. పేరెంట్స్ వద్ద డబ్బుల్లేకపోయినా నన్ను US పంపారు. ఏమీ లేని స్థాయి నుంచి ఈ పొజిషన్ కు వచ్చా. H-1B వీసా ఫీజు పెంపు వద్ద అక్రమ వలసలు తొలగిపోతాయి’ అని అభిప్రాయపడ్డారు.