News October 6, 2025

కృష్ణాజిల్లా వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ జట్ల ఎంపికలు

image

కృష్ణాజిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్ 14, 17 బాల బాలికల వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ జట్ల ఎంపికలు నిర్వహించనున్నారు. ఈ ఎంపికలు ఈనెల 7న ఉదయం 9 గంటలకు నున్న ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభమవుతాయి. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తప్పనిసరిగా స్టడీ సర్టిఫికేట్, జనన ధృవీకరణ పత్రం, పాఠశాల HM సంతకం, సీల్‌తో ఉన్న ఎంట్రీ ఫారం తీసుకురావాలని SGF కార్యదర్శులు దుర్గారావు, రాంబాబు తెలిపారు.

Similar News

News March 19, 2026

కృష్ణా జిల్లాలో ధాన్యం సేకరణ రికార్డు.. రూ. 1,744 కోట్ల చెల్లింపులు!

image

కృష్ణా జిల్లాలో 2025-26 ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ ప్రక్రియ దిగ్విజయంగా పూర్తయినట్లు జాయింట్ కలెక్టర్ నవీన్ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 92,639 మంది రైతుల నుంచి మొత్తం 7.34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. దీని విలువ రూ. 1,744.50 కోట్లుగా ఉంది. రైతు సేవా కేంద్రాల ద్వారా పారదర్శకంగా కొనుగోళ్లు జరిపామని, అన్నదాతలకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

News March 18, 2026

కృష్ణా: పదో తరగతి హిందీ పరీక్షకు 233 మంది గైర్హాజరు

image

పదో తరగతి హిందీ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. మొత్తం 21,312 మంది విద్యార్థులకు గాను 21,079 మంది పరీక్షకు హాజరయ్యారు. 233 మంది గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయ వర్గాలు తెలిపాయి. DLO 4, DEO 7, ACGE 5, డిస్ట్రిక్ట్ మోనటరింగ్ కో-ఆర్డినేటర్స్ 5, ఫ్లైయింగ్ స్క్వాడ్స్ 45 కేంద్రాలను తనిఖీ చేశాయి. ఓపెన్ స్కూల్ పరీక్షలకు సంబంధించి 598 మందికి 437 మంది హాజరయ్యారని తెలిపారు.

News March 18, 2026

పామర్రు: ‘పది’ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

image

పామర్రు జడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ డీకే బాలాజీ తనిఖీ చేశారు. పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. పరీక్షా కేంద్రం వద్ద అధికారులు ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరుగుతున్నాయని కలెక్టర్ చెప్పారు.