News October 6, 2025

బాపట్లకు రాష్ట్ర స్థాయిలో 1, జిల్లా స్థాయిలో 49 అవార్డ్స్

image

రాష్ట్ర స్థాయిలో బాపట్ల జిల్లాకు 1 అవార్డ్ వచ్చినట్లు కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం తెలిపారు. జిల్లా స్థాయిలో వివిధ విభాగాలలో 49 అవార్డులు వచ్చినట్లు వివరించారు. సోమవారం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఈ అవార్డులు పంపిణీ చేయనున్నట్లు వివరించారు.

Similar News

News March 11, 2026

గ్యాస్ బుక్ చేస్తున్నారా?

image

TG: గ్యాస్‌ సిలిండర్ల కొరతను ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. అందుకు నకిలీ LPG బుకింగ్ సైట్లను క్రియేట్ చేస్తున్నారని తెలిపారు. త్వరగా సిలిండర్ సప్లై చేస్తామంటే నమ్మొద్దని, అది మోసమని గ్రహించాలని చెప్పారు. సిలిండర్ బుకింగ్ పేరిట అపరిచిత వ్యక్తులకు OTPలు చెప్పొద్దని సూచించారు. ఈ తరహా మోసాలకు గురైతే 1930కి వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు.

News March 11, 2026

VKB: ‘అవకాశాలను మహిళలు అందిపుచ్చుకోవాలి’

image

మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా సాగుతుందని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ప్రోత్సహించాలని తెలిపారు. మహిళలు తమకు వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి దిశగా ముందడుగు వేయాలన్నారు.

News March 11, 2026

అల్లూరి జిల్లాకు రానున్న పవన్ కళ్యాణ్.. ఎప్పుడంటే?

image

ఈనెల 14న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారని జానపద కళలు సాంస్కృతిక సృజనాత్మక అకాడమీ చైర్మన్ గంగులయ్య తెలిపారు. పాడేరులో బుధవారం ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు అయిందని.. విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ గొర్ల వీర వెంకట్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.