News October 6, 2025
గాంధారి: ‘ఎక్స్‌ట్రాలు చేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తాం’

తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్‌ఎస్ 100 సీట్లు గెలుస్తుందని మాజీ మంత్రి, MLA హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. ‘ఎవరెవరు అధికారులు, ఇబ్బంది పెట్టిర్రో వాళ్లందరి సంగతి చెప్తాం’ అని హెచ్చరించారు. పోయిన 10 ఏళ్లు ఊకున్నాం. ఈసారి అట్లుండదు. ఎక్స్ట్రాలు చేసిన అధికారులకు వడ్డీతో సహా చెల్లిస్తాం’ అంటూ గాంధారిలో ఆదివారం జరిగిన సభలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Similar News
News March 11, 2026
అయోధ్యను తాకిన వంట గ్యాస్ కొరత

దేశంలో నెలకొన్న వంట గ్యాస్ కొరత అయోధ్యనూ తాకింది. రామమందిరం సమీపాన ఉండే అమావా ఆలయంలోని ప్రముఖ నిత్యాన్నదాన ప్రాంగణం రామ్ రసోయ్‌లో తాత్కాలికంగా అన్నదానం నిలిపివేశారు. అయోధ్యకు వచ్చే యాత్రికుల్లో వేలాది మందికి ఈ రామ్ రసోయ్ ప్రసాదాన్ని అందిస్తుంది. కాగా LPGకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మరోవైపు తిరుమలకు గ్యాస్ సరఫరా ఆపొద్దని <<19316913>>TTD<<>> ఇప్పటికే IOCLను కోరింది.
News March 11, 2026
నడిగూడెం: పౌరులంతా భాగస్వాములు కావాలి: SP

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నేరాల నివారణ, మహిళల భద్రత, సైబర్ మోసాలపై సూర్యాపేట జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో నడిగూడెం మండలం వల్లాపురం గ్రామంలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ కె. నరసింహ మాట్లాడుతూ.. సమాజంలో నేరాలను అరికట్టడంలో పౌరుల బాధ్యత కీలకమని పేర్కొన్నారు.
News March 11, 2026
VZM: ‘హౌసింగ్ ప్రాజెక్టులకు రెరా రిజిస్ట్రేషన్ తప్పనిసరి’

రాష్ట్రంలో 500 చదరపు మీటర్లు లేదా 8 అపార్ట్మెంట్లు పైబడిన ప్రతి హౌసింగ్ ప్రాజెక్ట్ తప్పనిసరిగా ఏపీ రెరా అథారిటీ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఏపీ రెరా ఛైర్మన్ ఆర్.ఎస్. శివారెడ్డి తెలిపారు. పట్టణంలోని ఓ హోటల్‌లో రెరా చట్టం–2016పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, వినియోగదారుల హక్కుల పరిరక్షణకు రెరా చట్టం అమలులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.


