News October 6, 2025

శుభ సమయం (06-10-2025) సోమవారం

image

✒ తిథి: శుక్ల చతుర్దశి ఉ.11.24 వరకు
✒ నక్షత్రం: పూర్వాభాద్ర ఉ.6.02 వరకు
✒ శుభ సమయం: లేవు
✒ రాహుకాలం: ఉ.7.30-ఉ.9.00
✒ యమగండం: ఉ.10.30-మ.12.00
✒ దుర్ముహూర్తం: మ.12.24-మ.1.12, మ.2.46-మ.3.34
✒ వర్జ్యం: మ.3.15-సా.4.46
✒ అమృత ఘడియలు: రా.12.36-రా.2.08

Similar News

News October 6, 2025

ఇంద్రకీలాద్రికి 20 లక్షల మంది భక్తులు

image

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై గత 14 రోజుల్లో 20 లక్షల మంది దుర్గమ్మను దర్శించుకున్నట్లు ఆలయ ఈవో వీకే శీనానాయక్ తెలిపారు. గత నెల 22 నుంచి ఈ నెల 2 వరకు 15.90 లక్షల మంది, దసరా ఉత్సవాల అనంతరం 3, 4, 5 తేదీల్లో 4 లక్షల మందికి పైగా అమ్మవారి దర్శనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇవాళ్టి నుంచి ఘాట్ రోడ్డులోకి వాహనాలను అనుమతించనున్నట్లు తెలిపారు. ఆలయ హుండీలను నేటి నుంచి 3 రోజులపాటు లెక్కించనున్నారు.

News October 6, 2025

దేవునికి ఎన్నిసార్లు హారతి ఇవ్వాలి?

image

శాస్త్రాల ప్రకారం.. దేవునికి మొత్తం 14 సార్లు హారతి ఇవ్వాలని పండితులు చెబుతున్నారు. ‘స్వామివారి పాదాల చెంత 4 సార్లు హారతి ఇవ్వాలి. ఇది ధర్మార్థలను కోరుతూ చేస్తారు. ఆ తర్వాత నాభి వద్ద 2 సార్లు(పోషణ కోసం), నోటి వద్ద ఓసారి (జ్ఞానం కోసం) హారతివ్వాలి. చివరిగా తల నుంచి పాదాల వరకు 7 సార్లు హారతిని తిప్పాలి. ఇవి సప్తలోక ఆశీస్సులను సూచిస్తాయి. ఇలా చేస్తే దైవానుగ్రహం లభిస్తుంది’ అని వివరిస్తున్నారు. <<-se>>#Pooja<<>>

News October 6, 2025

హమాస్‌తో సానుకూల చర్చలు జరిగాయి: ట్రంప్

image

హమాస్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలతో వీకెండ్‌లో సానుకూల చర్చలు జరిగాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ‘మిడిల్ ఈస్ట్‌లో శాంతి స్థాపన, గాజాలో యుద్ధం ముగింపు, బందీల విడుదలపై జరిగిన చర్చలు సక్సెస్ అయ్యాయి. ఈజిప్టులో ఇవాళ మరోసారి చర్చలు జరుగుతాయి. ఈ వారంలో ఫస్ట్ ఫేజ్ పూర్తవుతుంది. దీనిని వేగంగా పూర్తి చేయాలని చెప్పా. సమయం చాలా విలువైంది. లేదంటే భారీ రక్తపాతం జరుగుతుంది’ అని పేర్కొన్నారు.