News October 6, 2025
కల్తీ మద్యం కేసు.. కీలక TDP నేతలు ఔట్.!

రాష్ట్రంలో సంచలనం రేపిన ములకలచెరువు కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తంబళ్లపల్లి TDP నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ దాసరపల్లి జై చంద్రారెడ్డిని CM చంద్రబాబు ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఈ కేసులో నిందితుడుగా ఉన్న పీటీ మండలం మల్లెలకు చెందిన కట్ట సురేంద్ర నాయుడును సైతం పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News October 6, 2025
25వేల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్లు!

TG: ప్రభుత్వం ఏర్పడి ఈ DECతో రెండేళ్లు కానున్న నేపథ్యంలో మరిన్ని ఉద్యోగాల భర్తీకి INC సిద్ధమవుతోంది. 2 నెలల్లో 25వేల పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు సమాచారం. పోలీస్ శాఖలో 17వేల పోస్టులున్నట్లు DGP శివధర్ రెడ్డి ప్రకటించారు. వాటితో పాటు టీచర్, డిప్యూటీ DEO, డైట్, BEd కాలేజీల్లో లెక్చరర్లు, SERTలో ఖాళీలు నింపాలని TGPSC సన్నాహాలు చేస్తోంది. గ్రూప్-1,2,3,4 నోటిఫికేషన్లూ రిలీజ్ అయ్యే అవకాశముంది.
News October 6, 2025
శింగనమల వైసీపీ నాయకుడికి వైఎస్ జగన్ కీలక పదవి

శింగనమల నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకుడు బండ్లపల్లి ప్రతాప్ రెడ్డి వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ.. తనకు పార్టీలో ఉన్నత స్థాయి అవకాశాన్ని కల్పించిన వైసీపీ అధినేత జగన్, మాజీ మంత్రి శైలజానాథ్‌కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొన్నారు.
News October 6, 2025
ఇంద్రకీలాద్రికి 20 లక్షల మంది భక్తులు

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై గత 14 రోజుల్లో 20 లక్షల మంది దుర్గమ్మను దర్శించుకున్నట్లు ఆలయ ఈవో వీకే శీనానాయక్ తెలిపారు. గత నెల 22 నుంచి ఈ నెల 2 వరకు 15.90 లక్షల మంది, దసరా ఉత్సవాల అనంతరం 3, 4, 5 తేదీల్లో 4 లక్షల మందికి పైగా అమ్మవారి దర్శనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇవాళ్టి నుంచి ఘాట్ రోడ్డులోకి వాహనాలను అనుమతించనున్నట్లు తెలిపారు. ఆలయ హుండీలను నేటి నుంచి 3 రోజులపాటు లెక్కించనున్నారు.