News October 6, 2025

నకిలీ మద్యంపై ఉక్కుపాదం: CM చంద్రబాబు

image

AP: రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజల ప్రాణాలకు చేటు చేసే నకిలీ మద్యంపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో నకిలీ మద్యం వ్యవహారంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని సూచించారు. కాగా నిందితులు జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడును టీడీపీ సస్పెండ్ చేసింది.

Similar News

News October 6, 2025

పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ

image

ఆపరేషన్ సిందూర్‌తో భారత్ చేతిలో చావుదెబ్బ తిన్న పాక్ క్రీడల్లోనైనా గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతోంది. కానీ ఇండియా ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వడం లేదు. మొన్న ఆసియా కప్‌లో మెన్స్ టీమ్ 3మ్యాచుల్లో పాక్‌ను చిత్తు చేసింది. నిన్న ఉమెన్స్ WCలో మన అమ్మాయిలు దాయాదిపై గెలిచారు. ఇటీవల U-17 మెన్స్ ఫుట్‌బాల్ జట్టు కూడా పాక్‌ను మట్టికరిపించింది. ఒక్క మ్యాచ్ అయినా గెలవాలనుకుంటున్న పాక్ ఆశ ఎప్పుడు తీరుతుందో?

News October 6, 2025

25వేల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్లు!

image

TG: ప్రభుత్వం ఏర్పడి ఈ DECతో రెండేళ్లు కానున్న నేపథ్యంలో మరిన్ని ఉద్యోగాల భర్తీకి INC సిద్ధమవుతోంది. 2 నెలల్లో 25వేల పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు సమాచారం. పోలీస్ శాఖలో 17వేల పోస్టులున్నట్లు DGP శివధర్ రెడ్డి ప్రకటించారు. వాటితో పాటు టీచర్, డిప్యూటీ DEO, డైట్, BEd కాలేజీల్లో లెక్చరర్లు, SERTలో ఖాళీలు నింపాలని TGPSC సన్నాహాలు చేస్తోంది. గ్రూప్-1,2,3,4 నోటిఫికేషన్లూ రిలీజ్ అయ్యే అవకాశముంది.

News October 6, 2025

ఇంద్రకీలాద్రికి 20 లక్షల మంది భక్తులు

image

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై గత 14 రోజుల్లో 20 లక్షల మంది దుర్గమ్మను దర్శించుకున్నట్లు ఆలయ ఈవో వీకే శీనానాయక్ తెలిపారు. గత నెల 22 నుంచి ఈ నెల 2 వరకు 15.90 లక్షల మంది, దసరా ఉత్సవాల అనంతరం 3, 4, 5 తేదీల్లో 4 లక్షల మందికి పైగా అమ్మవారి దర్శనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇవాళ్టి నుంచి ఘాట్ రోడ్డులోకి వాహనాలను అనుమతించనున్నట్లు తెలిపారు. ఆలయ హుండీలను నేటి నుంచి 3 రోజులపాటు లెక్కించనున్నారు.