News October 6, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News October 6, 2025

నేడూ కొనసాగనున్న వర్షాలు

image

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ కూడా వర్షాలు కొనసాగుతాయని IMD తెలిపింది. ఏపీలోని ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, చెట్ల కింద నిలబడొద్దని సూచించింది. అటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఇవాళ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది.

News October 6, 2025

1,732 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తులు

image

ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ 1,732 పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు నవంబర్ 5వరకు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష(స్టేజ్1, స్టేజ్ 2), ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, జూనియర్ ఇంజినీర్, SO, స్టెనోగ్రాఫర్, JSA, మాలి, MTS తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి వేర్వేరు అర్హతలున్నాయి. వెబ్‌సైట్: https://dda.gov.in/

News October 6, 2025

పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ

image

ఆపరేషన్ సిందూర్‌తో భారత్ చేతిలో చావుదెబ్బ తిన్న పాక్ క్రీడల్లోనైనా గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతోంది. కానీ ఇండియా ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వడం లేదు. మొన్న ఆసియా కప్‌లో మెన్స్ టీమ్ 3మ్యాచుల్లో పాక్‌ను చిత్తు చేసింది. నిన్న ఉమెన్స్ WCలో మన అమ్మాయిలు దాయాదిపై గెలిచారు. ఇటీవల U-17 మెన్స్ ఫుట్‌బాల్ జట్టు కూడా పాక్‌ను మట్టికరిపించింది. ఒక్క మ్యాచ్ అయినా గెలవాలనుకుంటున్న పాక్ ఆశ ఎప్పుడు తీరుతుందో?