News October 6, 2025

మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది: ఎంపీ కావ్య

image

స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే మన అందరి లక్ష్యమని ఎంపీ కడియం కావ్య కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నిడిగొండలో జరిగిన నియోజక వర్గ స్థాయి కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ కార్యకర్తలు గత 10 ఏళ్లుగా కడుపు కట్టుకొని పనిచేశారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించే బాధ్యత తమదేనని అన్నారు.

Similar News

News October 6, 2025

పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ

image

ఆపరేషన్ సిందూర్‌తో భారత్ చేతిలో చావుదెబ్బ తిన్న పాక్ క్రీడల్లోనైనా గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతోంది. కానీ ఇండియా ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వడం లేదు. మొన్న ఆసియా కప్‌లో మెన్స్ టీమ్ 3మ్యాచుల్లో పాక్‌ను చిత్తు చేసింది. నిన్న ఉమెన్స్ WCలో మన అమ్మాయిలు దాయాదిపై గెలిచారు. ఇటీవల U-17 మెన్స్ ఫుట్‌బాల్ జట్టు కూడా పాక్‌ను మట్టికరిపించింది. ఒక్క మ్యాచ్ అయినా గెలవాలనుకుంటున్న పాక్ ఆశ ఎప్పుడు తీరుతుందో?

News October 6, 2025

25వేల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్లు!

image

TG: ప్రభుత్వం ఏర్పడి ఈ DECతో రెండేళ్లు కానున్న నేపథ్యంలో మరిన్ని ఉద్యోగాల భర్తీకి INC సిద్ధమవుతోంది. 2 నెలల్లో 25వేల పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు సమాచారం. పోలీస్ శాఖలో 17వేల పోస్టులున్నట్లు DGP శివధర్ రెడ్డి ప్రకటించారు. వాటితో పాటు టీచర్, డిప్యూటీ DEO, డైట్, BEd కాలేజీల్లో లెక్చరర్లు, SERTలో ఖాళీలు నింపాలని TGPSC సన్నాహాలు చేస్తోంది. గ్రూప్-1,2,3,4 నోటిఫికేషన్లూ రిలీజ్ అయ్యే అవకాశముంది.

News October 6, 2025

శింగనమల వైసీపీ నాయకుడికి వైఎస్ జగన్ కీలక పదవి

image

శింగనమల నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకుడు బండ్లపల్లి ప్రతాప్ రెడ్డి వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ.. తనకు పార్టీలో ఉన్నత స్థాయి అవకాశాన్ని కల్పించిన వైసీపీ అధినేత జగన్, మాజీ మంత్రి శైలజానాథ్‌కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొన్నారు.