News October 6, 2025
అక్టోబర్ 6: చరిత్రలో ఈరోజు

1860: భారతీయ శిక్షాస్మృతి చట్టమైన రోజు
1892: ఆంగ్ల కవి అల్ఫ్రెడ్ టెన్నిసన్ మరణం
1927: ప్రపంచంలో తొలి టాకీ చిత్రం ‘ది జాజ్ సింగర్’ అమెరికాలో విడుదల
1932: భారత భౌతిక శాస్త్రవేత్త గణేశన్ వెంకటరామన్ జననం
1946: బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా జననం (ఫొటోలో)
1963: హైదరాబాద్‌లో నెహ్రూ జూపార్క్ ప్రారంభం
1967: తెలుగు సినీ దర్శకుడు సి.పుల్లయ్య మరణం
Similar News
News October 6, 2025
1,732 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తులు

ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ 1,732 పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు నవంబర్ 5వరకు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష(స్టేజ్1, స్టేజ్ 2), ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, జూనియర్ ఇంజినీర్, SO, స్టెనోగ్రాఫర్, JSA, మాలి, MTS తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి వేర్వేరు అర్హతలున్నాయి. వెబ్‌సైట్: https://dda.gov.in/
News October 6, 2025
పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ

ఆపరేషన్ సిందూర్‌తో భారత్ చేతిలో చావుదెబ్బ తిన్న పాక్ క్రీడల్లోనైనా గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతోంది. కానీ ఇండియా ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వడం లేదు. మొన్న ఆసియా కప్‌లో మెన్స్ టీమ్ 3మ్యాచుల్లో పాక్‌ను చిత్తు చేసింది. నిన్న ఉమెన్స్ WCలో మన అమ్మాయిలు దాయాదిపై గెలిచారు. ఇటీవల U-17 మెన్స్ ఫుట్‌బాల్ జట్టు కూడా పాక్‌ను మట్టికరిపించింది. ఒక్క మ్యాచ్ అయినా గెలవాలనుకుంటున్న పాక్ ఆశ ఎప్పుడు తీరుతుందో?
News October 6, 2025
25వేల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్లు!

TG: ప్రభుత్వం ఏర్పడి ఈ DECతో రెండేళ్లు కానున్న నేపథ్యంలో మరిన్ని ఉద్యోగాల భర్తీకి INC సిద్ధమవుతోంది. 2 నెలల్లో 25వేల పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు సమాచారం. పోలీస్ శాఖలో 17వేల పోస్టులున్నట్లు DGP శివధర్ రెడ్డి ప్రకటించారు. వాటితో పాటు టీచర్, డిప్యూటీ DEO, డైట్, BEd కాలేజీల్లో లెక్చరర్లు, SERTలో ఖాళీలు నింపాలని TGPSC సన్నాహాలు చేస్తోంది. గ్రూప్-1,2,3,4 నోటిఫికేషన్లూ రిలీజ్ అయ్యే అవకాశముంది.