News October 6, 2025
ASF: స్థానిక పోరుకు ఎర్రజెండా పార్టీ కసరత్తు

ఆసిఫాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి CPM రంగం సిద్ధం చేస్తుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచుల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీ నాయకులు అభ్యర్థులను సిద్ధం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఎర్ర జెండాకు ప్రజలు మద్దతు పలుకుతారా లేదా అనేది ఈ ఎన్నికల్లో వేచి చూడాలి మరి.
Similar News
News October 6, 2025
నేడూ కొనసాగనున్న వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ కూడా వర్షాలు కొనసాగుతాయని IMD తెలిపింది. ఏపీలోని ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, చెట్ల కింద నిలబడొద్దని సూచించింది. అటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఇవాళ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది.
News October 6, 2025
ఉమ్మడి విశాఖలో 75 మందికి పదోన్నతులు

ఉమ్మడి విశాఖ జిల్లాలో 75 మంది తెలుగు, ముగ్గురు హిందీ భాష పండితులకు పదోన్నతులు లభించాయి. చివరిగా 2019లో కొందరికి పదోన్నతులు కల్పించి మిగిలిన వారిని డీఈఓ పూల్‌లో ఉంచారు. డీఈఓ పూల్‌లో ఉన్న 75 మంది భాష పండితులకు అడహక్ బేసిక్ ప్రాతిపదికన పదోన్నతులు కల్పిస్తూ విశాఖ జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయం చేసిన విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌కు వీరు కృతజ్ఞతలు తెలిపారు.
News October 6, 2025
MDK: నేడు ఏడుపాయల క్షేత్రంలో పల్లకీ సేవ

మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల శ్రీ వన దుర్గాభవాని మాత క్షేత్రంలో సోమవారం పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6 గంటలకు పల్లకి సేవ నిర్వహించనున్నట్టు ఆలయ కార్యనిర్వాహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ పల్లకి సేవా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకను విజయవంతం చేయాలని కోరారు.