News October 6, 2025
ఆసిఫాబాద్‌లో స్థానిక ఎన్నికల్లో వర్గ పోరు

కాంగ్రెస్ పార్టీ నుంచి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. ASFలో కాంగ్రెస్ వర్గ పోరు కొనసాగుతుండటంతో ఆశావహులకు ఎదురుదెబ్బ తగలక తప్పదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. డీసీసీ అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ ఒక వర్గమైతే.. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ శ్యాంనాయక్ మరో వర్గం. ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలకు రెండు వర్గాల నాయకులు ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
Similar News
News October 6, 2025
జయచంద్రారెడ్డి చుట్టూ అన్నీ వివాదాలే?

జయచంద్రారెడ్డి MLA అభ్యర్థిగా ఎన్నికైన నాటి నుంచి ఆయన చుట్టూ అనేక వివాదాలు చుట్టుముట్టాయి. జయచంద్రారెడ్డికి TDP బీ ఫార్మ్ తీసుకోవడంతో శంకర్ యాదవ్ వర్గీయులు ఆందోళనలు దిగారు. ఎన్నికల సమయంలో కనీసం బూత్‌లలో ఏజెంట్లను కూడా కూర్చోబెట్టుకోలేకపోయారనే వాదనలు ఉన్నాయి. పెద్దిరెడ్డి కుటుంబానికి జయచంద్రారెడ్డి సహకారం అందిస్తున్నట్లు తెలుగు తమ్ముళ్లు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
News October 6, 2025
నకిలీ మద్యం తయారీలో వేళ్లని ఆయన వైపే?

ములకలచెరువు నకిలీ మద్యం తయారీలో మూల సూత్రధారి జయచంద్రారెడ్డి అంటూ సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. పీఏ రాజేశ్, ప్రధాన అనుచరుడు కట్టా సురేంద్ర నాయుడును ముందు పెట్టి వ్యవహారాలన్నీ ఆయననే నడిపించాడని టాక్ నడుస్తోంది. ఈ ఆరోపణలను టీడీపీలోని మరో వర్గం బలంగా చెప్తోంది. జయచంద్రారెడ్డి పాత్రపై ఎక్సైజ్ పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
News October 6, 2025
ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీ రైతుల కలలకు రూపం

ఉయ్యూరులోని షుగర్ ఫ్యాక్టరీ 1941లో స్థాపించబడింది. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి చక్కెర తయారీ యూనిట్లలో ఒకటిగా పేరు గాంచింది. ఈ ఫ్యాక్టరీని ప్రస్తుతం KCP షుగర్ అండ్ ఇండస్ట్రీస్ నిర్వహిస్తోంది. ఇది కేవలం చక్కెరే కాకుండా, స్పిరిట్, ఇథనాల్, విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఇది చెరకు రైతులకు నాణ్యమైన ధర కల్పించడంతో పాటు, గ్రామీణ అభివృద్ధికి, స్థానికులకు ఉపాధి అవకాశాలను అందిస్తూ వారి కలలకు రూపం ఇస్తోంది.