News October 6, 2025

25వేల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్లు!

image

TG: ప్రభుత్వం ఏర్పడి ఈ DECతో రెండేళ్లు కానున్న నేపథ్యంలో మరిన్ని ఉద్యోగాల భర్తీకి INC సిద్ధమవుతోంది. 2 నెలల్లో 25వేల పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు సమాచారం. పోలీస్ శాఖలో 17వేల పోస్టులున్నట్లు DGP శివధర్ రెడ్డి ప్రకటించారు. వాటితో పాటు టీచర్, డిప్యూటీ DEO, డైట్, BEd కాలేజీల్లో లెక్చరర్లు, SERTలో ఖాళీలు నింపాలని TGPSC సన్నాహాలు చేస్తోంది. గ్రూప్-1,2,3,4 నోటిఫికేషన్లూ రిలీజ్ అయ్యే అవకాశముంది.

Similar News

News October 6, 2025

VITMలో 12పోస్టులు.. దరఖాస్తు చేశారా?

image

విశ్వేశ్వరయ్య ఇండస్ట్రీయల్& టెక్నలాజికల్ మ్యూజియం(VITM) 12 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 20వరకు అప్లై చేసుకోవచ్చు. వీటిలో ఎగ్జిబిషన్ అసిస్టెంట్, టెక్నిషియన్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్, ITI, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. దరఖాస్తు ఫీజు రూ.885. మహిళలు, SC, ST, PwDలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. వెబ్‌సైట్: https://www.vismuseum.gov.in/

News October 6, 2025

బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే ఇలా చెయ్యండి

image

మారిన జీవనశైలి వల్ల మహిళల్లో బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతోంది. దీనివల్ల డయాబెటిస్, హై బీపీ, గుండె జబ్బులు, లివర్ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువంటున్నారు న్యూట్రిషనిస్ట్ లహరి సూరపనేని. దీనికోసం ఆహారంలో మైదా, స్వీట్స్, జంక్ ఫుడ్ తగ్గించడం, ప్రొటీన్ ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. క్రమంతప్పని వ్యాయామం, మంచి నిద్రతో ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తూ స్ట్రెస్ తగ్గించుకోవాలని చెబుతున్నారు.

News October 6, 2025

UPI పిన్ మర్చిపోయారా? ఇలా చేయండి 2/2

image

చాలా మంది UPI పిన్‌ను మర్చిపోయి పేమెంట్స్ చేసే సమయంలో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి సమయంలో మీ UPI యాప్‌లో “Forgot UPI PIN” అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. మీ డెబిట్ కార్డు వివరాలను (చివరి 6 అంకెలు, గడువు తేదీ) ఉపయోగించి కొత్త పిన్‌ను సెట్ చేసుకోవచ్చు. వీలైనంత వరకు UPI పిన్‌ను లేదా OTPని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. UPI యాప్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి.