News April 7, 2024
ఉదయాన్నే బ్రష్ చేయకపోతే క్యాన్సర్ ముప్పు!
ఉదయాన్నే బ్రష్ సరిగ్గా చేయకపోతే పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని US పరిశోధకులు హెచ్చరించారు. ఫ్రెడ్హట్చిన్సన్ క్యాన్సర్ కేంద్రానికి చెందిన పరిశోధకులు 200 మంది క్యాన్సర్ బాధితులపై రీసెర్చ్ చేశారు. బాధితుల్లోని సగం కణతుల్లో దంతాల్లో ఉండే సూక్ష్మజీవులున్నట్లు గుర్తించారు. ఇవి క్యాన్సర్కు కారణమవుతాయని నిర్ధారించారు. 20-49 ఏళ్ల వయస్సు వారు దీని బారిన పడటం ఏడాదికి 1.5% పెరుగుతోందని తెలిపారు.
Similar News
News February 5, 2025
ముగిసిన ఢిల్లీ ఎన్నికల పోలింగ్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 58 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. సా.6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్నాయి.
News February 5, 2025
తండ్రి అయ్యేందుకు 11వేల కి.మీలు ప్రయాణం
దక్షిణ చిలీలోని ‘పార్క్ టంటాకో’ అటవీ ప్రాంతాల్లో ఉండే డార్విన్స్ కప్పలకు ప్రాణాంతక కైట్రిడ్ ఫంగస్ సోకినట్లు 2023లో గుర్తించారు. దీంతో ఈ జాతి అంతరించిపోకుండా ఉండేందుకు చేపట్టిన ఎమర్జెన్సీ మిషన్లో మగ కప్పలను యూకేకు తరలించారు. దీనికోసం బోటు, విమానం, కారులో ఇలా 11వేల కి.మీలకు పైగా ప్రయాణించాయి. ఎట్టకేలకు ఈ అసాధారణ విధానం ద్వారా యూకేలో 33 పిల్లలు జన్మనిచ్చాయి. ఇవి 2గ్రాముల కంటే తక్కువ బరువుంటాయి.
News February 5, 2025
విడదల రజినీపై కేసుకు హైకోర్టు ఆదేశం
AP: మాజీ మంత్రి విడదల రజినీపై 2 వారాల్లోగా కేసు నమోదు చేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. కేసు వివరాలను తమకు పంపాలని పేర్కొంది. 2019లో రజినీని ప్రశ్నించినందుకు తనను చిత్రహింసలకు గురి చేశారంటూ పిల్లి కోటి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టించి పోలీసులతో కొట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు రజినీపై కేసు నమోదు చేయకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.