News October 6, 2025

గూడూరులో రోడ్డు ప్రమాదం

image

గూడూరు రూరల్ పరిధిలోని చెన్నూరు తిప్పవరపాడు సమీపంలో ఆదివారం రాత్రి ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పొదలకూరు నుంచి గూడూరు వైపు వస్తున్న RTC బస్సును గూడూరు నుంచి తిప్పవరపాడు వైపు వెళుతున్న బైకు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహన దారుడి గాయాలయ్యాయి. అతన్ని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది.

Similar News

News March 12, 2026

NTR: వరద ముప్పు నివారణకు రూ.600 కోట్లతో ప్రణాళిక

image

వరద ముప్పు నివారణకు రూ.600 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసినట్లు సెంట్రల్ MLA బోండా ఉమ గురువారం ట్వీట్ చేశారు. ఈ నిధులతో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు మేజర్ అవుట్ ఫాల్ డ్రైన్లతో డ్రైనేజ్ సిస్టం అభివృద్ధి చేస్తామన్నారు. 440 కి.మీ పొడవున నిర్మించే కాలువలలో 252 కి.మీ. మేర ఇప్పటికే నిర్మాణం పూర్తైందని, వర్షాకాలానికి ముందే పనులు పూర్తి చేస్తామని ఉమ Xలో పోస్ట్ చేశారు.

News March 12, 2026

NTR జిల్లాకు రూ.67.69 కోట్లు మంజూరు

image

అన్నదాత సుఖీభవ-PM కిసాన్ పథకం మూడో విడత నిధులు శుక్రవారం NTR జిల్లా రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. జిల్లాలోని 1.18 లక్షలు మంది రైతుల ఖాతాల్లో రూ.67.69 కోట్ల నిధులు జమ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ విడతలో రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.6,000ల చొప్పున జమ అవుతాయన్నారు. రైతులు ఈ నిధులను తదుపరి పంట సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు వంటి వ్యవసాయ అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు.

News March 12, 2026

HYD: గ్యాస్ లేకపోతే ఈ ఆలోచన మీకు రాదా?

image

రూ.5కే కడుపు నింపుతున్న సంస్థలు స్టీమ్ బాయిలర్లు వాడుతుంటే.. వేలల్లో బిల్లులు వసూలు చేసే 5 స్టార్ హోటళ్లు, హాస్టళ్లు గ్యాస్ వాడుతున్నాయి. గ్యాస్ ధర పెరిగిందని కస్టమర్ల జేబులు కత్తిరించే బదులు హరే రామ హరే కృష్ణ ట్రస్ట్‌ల స్టీమ్ వంట పద్ధతికి మారితే ఖర్చు తగ్గుతుంది కదా. కార్పొరేట్ హాస్టళ్లు గ్యాస్ సంక్షోభం సాకుతో మెస్ ఛార్జీలు పెంచడం కరెక్టేనా? గ్యాస్ లేకపోతే.. స్టీమ్ బాయిలర్లు ఉన్నాయి. <<19364190>>సోచో జరా!<<>>