News October 6, 2025
NLC ఇండియా లిమిటెడ్‌లో 163 పోస్టులు

NLC ఇండియా లిమిటెడ్ 163 అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఐటీఐ ట్రేడ్, డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కోసం ఈ నెల 23వరకు అప్లై చేసుకోవచ్చు. హార్డ్ కాపీని ఈ నెల 30 వరకు పంపించాలి. అకడమిక్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ముందుగా NATS/NAPS పోర్టల్‌లో ఎన్‌రోలింగ్ కావాలి. వెబ్‌సైట్: https://www.nlcindia.in/
Similar News
News October 6, 2025
ఆయుధాలు వీడండి.. క్యాడర్‌కు మల్లోజుల లేఖ

క్యాడర్‌కు సీనియర్ మావోయిస్ట్ మల్లోజుల వేణుగోపాల్ బహిరంగ లేఖ రాశారు. ‘పార్టీలో అంతర్గతంగా చర్చించి ఆయుధాలు వీడాలి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా. పార్టీ చేసిన తప్పిదాలతో తీవ్ర నష్టాన్ని చూశాం. ఉద్యమం ఓటమిపాలు కాకుండా కాపాడులేకపోయాం. అనవసర త్యాగాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలి. తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం టీకాలాంటిది’ అంటూ 22 పేజీల <
News October 6, 2025
13,217 బ్యాంక్ ఉద్యోగాలు.. BIG ALERT

IBPS ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 13,217 ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ల పోస్టులకు అప్లై చేసుకున్నవారికి అలర్ట్. దరఖాస్తుల్లో తప్పులుంటే సరిచేసుకోవడానికి ఇవాళ, రేపు మాత్రమే అవకాశం ఉంది. https://www.ibps.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఎడిట్ చేసుకోవచ్చు. నవంబర్, డిసెంబర్‌లో ప్రిలిమ్స్, ఫిబ్రవరిలో మెయిన్స్ పరీక్షలుంటాయి.
* మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>‘జాబ్స్’<<>> కేటగిరీకి వెళ్లండి.
News October 6, 2025
రిజర్వేషన్లపై హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్లు

TG: ప్రభుత్వం ప్రతిపాదించిన BC రిజర్వేషన్లకు మద్దతుగా హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ నేత VH, బీసీ ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య, మాజీ IAS చిరంజీవులు వీటిని ఫైల్ చేశారు. బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలైంది. ఈక్రమంలోనే ఈ కేసులో తమ వాదనలూ వినాలని కోరుతూ ఇంప్లీడ్ పిటిషన్లు వేశారు. వీటన్నింటినీ న్యాయస్థానం ఎల్లుండి విచారించనుంది.