News October 6, 2025
గూడూరు: రాత్రయితే బస్సుల కోసం పడిగాపులే

నెల్లూరు – తిరుపతి మధ్యలో రాత్రయితే బస్సుల కోసం పడిగాపులు తప్పడం లేదు. ఈ మార్గంలో నెల్లూరు బస్టాండ్లోనే బస్సులు నిండిపోవడంతో గూడూరు బస్టాండ్‌కు వెళ్లకుండానే నేరుగా తిరుపతికి వెళ్లిపోతున్నాయి. దీంతో గూడూరు బస్టాండ్‌కు బస్సులు రాకపోవడంతో బైపాస్‌లో అర్థ రాత్రయినా బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ అధికారులు ఈ పరిస్థితిని గమనించి ఈ సమయంలో సర్వీస్‌లను పెంచాలని కోరుతున్నారు.
Similar News
News March 13, 2026
హైవేల వెంట వేసైడ్ అమెనిటీస్‌కు పెట్టుబడిదారుల ఆసక్తి : కలెక్టర్

జిల్లాలో రోడ్డు, హైవే మార్గాల వెంట ప్రయాణికులకు అవసరమైన ఆధునిక సౌకర్యాలను కల్పించే వేసైడ్ అమెనిటీస్ (Wayside Amenities) ఏర్పాటుకు పెట్టుబడిదారుల నుంచి గణనీయమైన ఆసక్తి వ్యక్తమవుతోందని కలెక్టర్ హిమాన్షు శుక్ల సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ప్రాజెక్టుల్లో ప్రయాణికులకు సౌకర్యంగా ఫుడ్ కోర్టులు, పెట్రోల్ బంకులు, ఎలక్ట్రిక్ వాహనాలకు EV ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయన్నారు.
News March 12, 2026
నెల్లూరు: రైల్వే రిక్రూట్ మెంట్ పరీక్షలకు ఉచిత శిక్షణ

BC స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో రైల్వే రిక్రూట్ మెంట్ గ్రూప్-D 2026 పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు బీసీ వెల్ఫేర్ అధికారి పి. వెంకట లక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన BC,SC,ST కులాలకు చెందిన అర్హులైన అభ్యర్థులు ఈనెల 23వ తేదీ లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. మెరిట్ ఆధారంగా ఎంపిక కాబడిన 100 మంది అభ్యర్థులకు ఈనెల 25వ తేదీ నుంచి ఈ ఉచిత శిక్షణా తరగతులను ఏర్పాటు చేస్తామన్నారు.
News March 12, 2026
గూడూరు ఎమ్మెల్యే కారుకు ప్రమాదం

గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్‌కు త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఇవాళ జరుగుతున్న మంత్రి లోకేశ్ పర్యటనకు ఎమ్మెల్యే సునీల్ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా లోకేశ్ కాన్వాయ్‌లో వెళ్తున్న సునీల్ కుమార్ కారుకు అల్లూరు మండలం, సున్నపుబట్టి వద్ద త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారందరూ సురక్షితంగా బయట పడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


