News October 6, 2025

సిద్దిపేట: ఏం IDEA గురూ.. ఆన్‌లైన్‌లో ప్రచారం!

image

సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయాలనుకుంటున్న ఆశావహులు సోషల్ మీడియా ప్రచారాన్ని మొదలుపెట్టారు. గ్రామాల్లో వాట్సప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసి ఓటర్లను చేర్చి వాగ్దానాలతో హోరెత్తిస్తున్నారు. ఫేస్ బుక్ పేజీలు క్రియేట్ చేసి పోస్ట్‌లతో హల్చల్ చేస్తున్నారు. యూ ట్యూబ్‌లో ఛానల్ స్టార్ట్ చేసి వీడియోలు పెడుతున్నారు. ఇన్‌స్టా గ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేసి రీల్స్ చేస్తున్నారు.

Similar News

News March 14, 2026

హాస్టళ్లలో కట్టెల పొయ్యిలపై వంట.. ఐటీ కారిడార్‌లో పొగ

image

TG: హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ల కొరతతో చాలా వరకు హాస్టళ్లలో కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్నారు. దీంతో ఐటీ కారిడార్‌లో బిల్డింగుల మధ్య నుంచి పొగ వ్యాపిస్తున్న ఫొటో వైరల్‌గా మారింది. ఇప్పటికే చాలా పీజీలు, హాస్టళ్లలో టిఫిన్లు ఆపేశారు. తక్కువ గ్యాస్ వినియోగంతో పూర్తయ్యే వంటలే చేస్తున్నారు.

News March 14, 2026

ఒక్క రోజులో 1.34లక్షల ఇండక్షన్ స్టవ్స్ విక్రయం

image

దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా ప్రజలు ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టవ్స్‌ వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో వీటి విక్రయాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. సాధారణంగా నెలకు 1.80 లక్షల అమ్మకాలు జరిగే చోట ఒక్క రోజే అమెజాన్‌లో 1.34 లక్షలకు పైగా స్టవ్‌లు అమ్ముడయ్యాయి. ఈ అనూహ్య డిమాండ్‌ను కంపెనీలు సైతం ఊహించకపోవడంతో చాలాచోట్ల ‘అవుట్ ఆఫ్ స్టాక్’ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

News March 14, 2026

శ్రీగిరిలో ఉగాది కోలాహలం

image

శ్రీశైలం క్షేత్రం ఉగాది ఉత్సవాలకు సిద్ధమైంది. ఈ వేడుకల కోసం కర్ణాటక నుంచి కన్నడ భక్తులు భారీగా తరలివస్తున్నారు. క్షేత్రమంతా భజనలు, నృత్యాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. సోమవారం నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, పాదయాత్రగా వస్తున్న భక్తుల శివనామస్మరణతో నల్లమల కొండలు మారుమోగుతున్నాయి. భక్తుల రాకతో శ్రీగిరి పరిసరాలు కిక్కిరిసిపోయాయి.