News October 6, 2025
కంచరపాలెంలో భారీ చోరీ

విశాఖలో ఆదివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. కంచరపాలెంలోని ఇందిరానగర్-5లో ముగ్గురు దుండగులు ఇంట్లో చొరబడి వృద్ధురాలు, అతని మనవడిని తాళ్లతో కట్టేశారు. 10 తులాలు బంగారం, రూ.3లక్షల నగదు దొచుకుని కారులో పరారయ్యారు. విషయం తెలుసుకున్న కంచరపాలెం క్రైమ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీసీ ఫుటేజీలు ఇతర ఆధారాలు సేకరిస్తున్నారు.
Similar News
News March 5, 2026
పెద్దపల్లి జిల్లాలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ ప్రారంభం

మార్చి 6 -15 వరకు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించాలని, గ్రామాలు, పట్టణాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్ 10 రోజుల్లో క్లియర్ చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. 99 రోజుల ప్రత్యేక కార్యాచరణలో హెల్త్, సంక్షేమం, విద్య, వ్యవసాయ, మహిళా సంక్షేమం, పర్యావరణ కార్యక్రమాలు చేపడతారు. వారివారీ ఫీల్డ్ తనిఖీలు, స్థానిక సంస్థల ఫోకస్, పాఠశాల పరిశీలన, ప్రజా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు.
News March 5, 2026
ఇంటర్ తర్వాత ఏయే కోర్సులున్నాయంటే?

ఇంటర్‌లో MPC, BiPC, CEC, HEC, MEC చదివినవారు తర్వాత ఏం చేస్తే ఉత్తమ భవిష్యత్తు ఉంటుందో తెలుసుకుందాం. MPC చదివినవారు ఇంజినీరింగ్ వైపు వెళ్లాలనుకుంటే EAPCET రాసి బీటెక్ (B.Tech)లో చేరవచ్చు. ప్రస్తుతం ఐటీ రంగంలో డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్ (CSE), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్స్ (ECE) వంటి కోర్సులు తీసుకోవచ్చు. సివిల్, మెకానికల్ విభాగాల్లోనూ మంచి అవకాశాలున్నాయి. రేపు 2PMకు BiPC గురించి..
News March 5, 2026
డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

న్యూఢిల్లీలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీలో 10 సైంటిస్ట్ C పోస్టులకు అప్లై చేయడానికి మార్చి 14 ఆఖరు తేదీ. PhD(లైఫ్ సైన్స్/ బయో టెక్నాలజీ/ బయో కెమిస్ట్రీ/ఫార్మాస్యూటికల్/అగ్రికల్చరల్/ వెటర్నరీ సైన్సెస్), MD అర్హత గల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.67,700-రూ.2,08700 చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.dbtindia.gov.in


