News October 6, 2025

ప్రత్యేక అలంకరణలో భద్రకాళి అమ్మవారు

image

వరంగల్ కొంగు బంగారమైన శ్రీ భద్రకాళి దేవాలయంలో ఈరోజు ఉదయం అమ్మవారిని ఆలయ అర్చకులు ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం అమ్మవారికి విశేషమైన హారతి ఇచ్చారు. భక్తులు ఉదయం నుంచే ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నారు.

Similar News

News March 15, 2026

వరంగల్: పల్లెలకు నిధుల జల్లు

image

గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. వరంగల్ జిల్లాకు రూ.14.93, హనుమకొండకు 13.65, భూపాలపల్లికి 4.65, జనగామకు 6.03, మహబూబాబాద్‌కు 9.30, ములుగు జిల్లాకు 17.13 కోట్ల చొప్పున నిధులు కేటాయించారు. కాగా అత్యధికంగా ములుగు జిల్లాకు, తక్కువగా భూపాలపల్లి జిల్లాకు కేటాయించారు. ఈ నిధులతో గ్రామాల్లో పెండింగ్‌లోని నిర్మాణాత్మక పనులను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

News March 15, 2026

శ్రీశైలంలో రేపటి నుంచి ఉగాది ఉత్సవాలు

image

జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో సోమవారం నుంచి ఉగాది ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 20వ తేదీ వరకు నిర్వహించే ఈ ఉత్సవాల్లో సోమవారం ఉదయం 9 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశం, చండీశ్వర పూజా కార్యక్రమాలతో ఉత్సవాలను ప్రారంభిస్తారు. ముఖ్యంగా అమ్మవారికి అలంకరణలు, స్వామి, అమ్మవార్ల వాహన సేవలు, 18న వీరాచారా విన్యాసాలు, 19న పంచాంగ శ్రవణం, రథోత్సవం, 20న పూర్ణాహుతి తదితర కార్యక్రమాలను నిర్వహిస్తారు.

News March 15, 2026

ఏలూరు ఎంపీకి డ్రగ్స్ పాజిటివ్: ఎస్పీ

image

TG: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్‌కు పాజిటివ్ వచ్చినట్లు ‘ఈగల్’ ఎస్పీ గిరిధర్ వెల్లడించారు. నిన్న యూరిన్ టెస్టు చేయగా <<19386182>>నెగటివ్<<>> వచ్చిందని, ఈరోజు టెస్టు చేయగా కొకైన్ పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా డ్రగ్స్ తీసుకుంటే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. FIRలో మొత్తం 11 మంది పేర్లను చేర్చారు.