News October 6, 2025

విశాఖలో ‘ఆపరేషన్ లంగ్స్’ కొనసాగుతుంది

image

విశాఖలో ‘ఆపరేషన్ లంగ్స్’ కొనసాగుతోందని జీవీఎంసీ అదనపు కమిషన్ డి.వి. రమణమూర్తి, చీఫ్ సిటీ ప్లానర్ ఏ.ప్రభాకర్‌రావు తెలిపారు. దసరా సందర్భంగా ఆక్రమణల తొలగింపునకు తాత్కాలిక విరామం ఇచ్చారు. పలువురు స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించుకున్నప్పటకీ, కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఆక్రమణలు కొనసాగుతున్నాయన్న ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని తొలగిచేందుకు ఆపరేషన్ లంగ్స్ కొనసాగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Similar News

News October 6, 2025

పీజీఆర్ఎస్ అర్జీలపై విశాఖ కలెక్టర్ సీరియస్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) అర్జీల పరిష్కారంలో జాప్యంపై అధికారుల తీరుపై కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అర్జీలు రీ-ఓపెన్ కాకుండా, సక్రమంగా ఎండార్స్‌మెంట్ ఇవ్వాలని ఆదేశించారు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ తీరును తప్పుబట్టారు. నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆలస్యంగా వచ్చిన వారికి మెమోలు ఇవ్వాలని డీఆర్వోను ఆదేశించారు.

News October 6, 2025

కంచరపాలెం ఘటనలో విస్తుపోయే నిజాలు

image

కంచరపాలెం ఇందిరానగర్-5 <<17925697>>చోరీ ఘటన<<>>లో విస్తుపోయే నిజాలు వెలువడ్డాయి. ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి వెనుక తలుపు పగలగొట్టి హాల్లో పడుకున్న ఎల్లమ్మ నోటికి ప్లాస్టర్ వేసి 6బంగారు గాజులు, 2తులాల చైన్ లాక్కున్నారు. పక్కగదిలో పడుకున్న కృష్ణకార్తీక్ రెడ్డి కాళ్లు,చేతులు కట్టి చేతులతో కొట్టి బంగారు ఉంగరం, బీరువాలో రూ.3లక్షల నగదు దోచేశారు. బాధితుల కారులోనే పరారైనట్లు క్రైమ్ పోలీసులు తెలిపారు.

News October 6, 2025

సిరిపురం వద్ద ఇంటర్ విద్యార్థి మృతి

image

విశాఖలో ఆదివారం అర్ధరాత్రి విషాదరం నెలకొంది. సిరిపురం జంక్షన్ వద్ద జరిగిన ప్రమాదంలో మహారాణిపేటలోని ఊటగెడ్డకు చెందిన హరీష్(17) మృతి చెందాడు. స్పోర్ట్స్ బైక్‌పై వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.