News October 6, 2025

నిజాంసాగర్: 3 గేట్ల నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

image

నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద తాకిడి తగ్గుముఖం పట్టింది. సోమవారం ఉదయం 6 గంటలకు 16,507 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 3 వరద గేట్లను ఎత్తి 10,987 క్యూసెక్కుల నీటిని మంజీరాకు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ అక్షయ్ తెలిపారు. పూర్తిస్థాయి నీటి నిల్వ 17.802 టీఎంసీలకు గాను, ప్రస్తుతం ప్రాజెక్టులో 17.759 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు వెల్లడించారు.

Similar News

News March 13, 2026

పవన్ ‘ఫ్లాప్ స్టార్’: MLA తాటిపర్తి

image

యర్రగొండపాలెం MLA తాటిపర్తి చంద్రశేఖర్ సోషల్ మీడియా వేదికగా DyCM పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. సినిమాల్లో ‘పవర్ స్టార్’ బిరుదు ఎలా వచ్చిందో దేవుడికే తెలుసని వ్యాఖ్యానించిన ఆయన, ప్రభుత్వ పరిపాలనలో మాత్రం ఫ్లాప్ స్టార్ అయిపోయారని ట్వీట్ చేశారు. గత రెండేళ్లలో అటవీ శాఖ ద్వారా కేవలం రూ.83 కోట్ల సంపద మాత్రమే సృష్టించారని, ఆ డబ్బు కూడా షూటింగ్ ట్రిప్పులకే ఖర్చు అయిపోయి ఉంటుందని ఎద్దేవా చేశారు.

News March 13, 2026

వాడపల్లి కేసులో వివరణ కోరిన మానవ హక్కుల సంఘం

image

వాడపల్లి పోలీసుల కస్టడీలో గిరిజన యువకుడు సాయి సిద్ధుపై జరిగిన చిత్రహింసల ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్‌ తీవ్రంగా పరిగణించింది. బాధితుడికి రూ.50 వేల నష్టపరిహారం ఎందుకు చెల్లించకూడదో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తక్షణమే వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ విషయాన్ని హైకోర్టు న్యాయవాది రేవంత్ వెల్లడించారు.

News March 13, 2026

వివాదంలో మరో IPL జట్టు

image

హండ్రెడ్ లీగ్‌లో PAK బౌలర్ అబ్రార్‌ను తీసుకొని <<19368622>>సన్‌రైజర్స్<<>> విమర్శలు ఎదుర్కొంటుండగా తాజాగా మరో IPL జట్టు వివాదంలో చిక్కుకుంది. CSKపై సన్ టీవీ రూ.కోటికి దావా వేసింది. జైలర్, జైలర్-2, కూలీ సినిమాల్లోని బ్యాగ్రౌండ్ మ్యూజిక్, ఆడియో ట్రాక్‌, డైలాగులు వాడుకొని కాపీరైట్ ఉల్లంఘించిందని మద్రాస్ HCకు చెప్పింది. కాగా వాటిని తొలగించామని CSK చెప్పగా మరోసారి ఇరువర్గాల వాదన విని నిర్ణయం తీసుకుంటామని HC తెలిపింది.