News October 6, 2025

చిత్తూరు: 18 మండలాలలో వర్షం

image

జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 18 మండలాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. శాంతిపురం మండలంలో అత్యధికంగా 86.4 మి.మీ వర్షపాతం నమోదైంది. వి.కోటలో 38, రామకుప్పంలో 24.8, సదుంలో 20.6, రొంపిచెర్లలో 17.8, కుప్పంలో 12, గుడుపల్లెలో 10.4, విజయ పురంలో 10.2, చిత్తూరు అర్బన్లో 4.2, కార్వేటినగరంలో 3.4, పెనుమూరు, పుంగనూరు, నిండ్రలో 3.2, బంగారుపాళ్యంలో 3, నగరిలో 2.2మీ. మీ. వర్షపాతం నమోదయింది.

Similar News

News March 17, 2026

చిత్తూరు జిల్లాలో పోలీసుల విస్తృత తనిఖీలు

image

ఎస్పీ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లాలో పలుచోట్ల మంగళవారం సాయంత్రం పోలీసు అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ వినియోగం, డ్రంకెన్ డ్రైవ్, లైసెన్స్‌లు, సర్టిఫికెట్లు తదితరు వాటిని పరిశీలించారు. ప్రజా భద్రత ధ్యేయంగా ఈ తనిఖీలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.

News March 17, 2026

చిత్తూరు: జగన్‌ను కలిసిన కరుణాకర్ రెడ్డి

image

మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలో వైసీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని వైసీపీ శ్రేణులు పలుచోట్ల నిరసన తెలిపారు. ఆయనపై భూమన కూడా పలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

News March 17, 2026

పాకాల: ఉదయాన్నే హైవేపై ప్రమాదం

image

పాకాల(M) నేండ్ర గుంట సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ప్రమాదం జరిగింది. కొత్తూరుకు చెందిన రామకృష్ణారెడ్డి ఆవుని తీసుకుని రోడ్డు దాటుచుండగా తిరుపతి వైపు వెళ్తున కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో పాడి ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన రామకృష్ణారెడ్డిని ఆసుపత్రికి తరలించారు. పాకాల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.