News October 6, 2025
కరీంనగర్: సారీ… సర్పంచికి పోటీ చేయలేం

గతంలో సర్పంచిగా చేసి అప్పులపాలైన వారిని చూసిన విలేజ్ లీడర్స్ ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే జంకుతున్నారు. స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని సర్పంచులు సొంత ఖర్చులతో అభివృద్ధి పనులు చేపట్టారు. గ్రామీణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల నిధులు విడుదల కాకపోవడంతో అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నారు. ఎన్నికల్లో అయ్యే ఖర్చుతో పాటు అభివృద్ధి పనులకు నిధులు విడుదల కాకపోతే పరిస్థితి ఏంటన్న చర్చ జోరుగా సాగుతోంది.
Similar News
News March 6, 2026
ఇతనికి 60 ఏళ్లు.. నమ్ముతారా?

తన ఏజ్‌లెస్ లుక్స్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సింగపూర్ మోడల్ చువాండో టాన్ ఈ నెల 3న 60 ఏళ్లు పూర్తిచేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అరవైలో ఇరవైలా ఉండటమంటే ఇదేనని, ఇతను వ్యాంపైర్ అయి ఉంటాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. హై ప్రొటీన్ ఫుడ్, మద్యం, ధూమపానం, చక్కెరకు దూరంగా ఉండటం, డైలీ వ్యాయామం, స్విమ్మింగ్ తన ఫిట్‌నెస్‌కు కారణమని అతను చెబుతుంటారు.
News March 6, 2026
KMR: దొంగతనం.. ఎనిమిది నెలల జైలు

చోరీకి పాల్పడిన నిందితుడికి కోర్టు 8నెలల జైలుశిక్షతో పాటు ₹300 ఫైన్ విధించింది. SP రాజేశ్ చంద్ర తెలిపిన వివరాలు.. భిక్కనూర్ వాసి వేణు ఇంటికి తాళం వేసి వెళ్లాడు. మరుసటి రోజు వచ్చి చూడగా తలుపులు పగులగొట్టి ఉన్నాయి. ₹10 వేలు చోరీకి గురైనట్లు గుర్తించారు. చిట్లపల్లి సాగర్ చోరికి పాల్పడినట్లు గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు నిందితుడికి శిక్ష, జరిమానా ఖరారు చేసింది.
News March 6, 2026
చరిత్రలో ఈరోజు (మార్చి 6)

* 1899: తెలుగు రచయిత్రి, స్వాతంత్ర్య సమరయోధురాలు తల్లాప్రగడ విశ్వసుందరమ్మ జననం
* 1913: తొలితరం హాస్యనటుడు కస్తూరి శివరావు జననం
* 1917: సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు జననం
* 1919: సాహితీవేత్త గడియారం రామకృష్ణ శర్మ జననం
* 1933: సినీ నటి కృష్ణకుమారి జననం (ఫొటోలో)
* 1964: పిఠాపురం చివరి రాజు మహీపతి సూర్యారావు మరణం
* 2016: నటుడు కళాభవన్ మణి మరణం


