News October 6, 2025
నిర్మల్: బతుకమ్మ ఆడుతూ మహిళ మృతి

నిర్మల్ జిల్లాలో జరిగిన బతుకమ్మ వేడుకలు విషాదాన్ని నింపాయి. బతుకమ్మ కోసం వినియోగించిన డీజే కారణంగా బంగల్ పేట్‌కు చెందిన భాగ్యలక్ష్మి (56) గుండెపోటుతో మరణించారు. శనివారం రాత్రి డీజే శబ్దాల మధ్య బతుకమ్మ ఆడుతూ అస్వస్థతకు గురయ్యారు. ఆమెను వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స నిర్వహిస్తుండగానే మృతి చెందారు. డీజే సౌండ్ కారణంగా గుండెపోటు వచ్చిందని వైద్యులు నిర్ధారించారు.
Similar News
News October 6, 2025
BREAKING: రిజర్వేషన్లపై పిటిషన్ డిస్మిస్

TG: బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం 42శాతానికి పెంచడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. హైకోర్టులో విచారణలో ఉండగా సుప్రీంకు ఎందుకు వచ్చారని పిటిషనర్ గోపాల్‌రెడ్డిని ప్రశ్నించింది. అయితే HCలో స్టే ఇవ్వకపోవడంతో ఇక్కడికి వచ్చామని పిటిషనర్ తెలిపారు. దీంతో HCలో పెండింగ్‌లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని SC స్పష్టం చేసింది. కాగా ఎల్లుండి హైకోర్టులో విచారణ జరగనుంది.
News October 6, 2025
తుమ్మలలో ట్రాక్టర్ నడిపిన మంత్రి సత్యకుమార్

ధర్మవరంలోని తుమ్మలలో నిర్వహించిన వ్యవసాయ యంత్రాలపై జీఎస్టీ తగ్గింపు అవగాహన కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాక్టర్ నడుపుతూ రైతులతో కలసి జీఎస్టీ తగ్గింపు వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఎన్డీఏ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అగ్ర ప్రాధాన్యతగా తీసుకుంటోందని తెలిపారు.
News October 6, 2025
బీసీ రిజర్వేషన్ల జీవోపై సుప్రీంలో విచారణ ప్రారంభం

TG: స్థానిక ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో-9ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంలో విచారణ ప్రారంభమైంది. ప్రభుత్వం తరఫున లాయర్లు సింఘ్వీ, దవే వాదనలు వినిపిస్తున్నారు. విచారణ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి కూడా సుప్రీంకోర్టుకు వెళ్లారు.