News October 6, 2025
ఫైల్స్ వికేంద్రీకరణ.. మొదలుపెట్టిన మంత్రి సత్య

AP ఆరోగ్యమంత్రి సత్యకుమార్ ఫైల్స్ వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారు. నిర్ణయాలు, పనుల్లో వేగం పెంచేందుకు ప్రతి ఫైల్ తనకు చేరనవసరం లేదన్నారు. 28 అంశాల్లో తన శాఖ CS, తదితర ఉన్నతాధికారులకు డిసిషన్ పవర్ ఇచ్చారు. CM, కేబినెట్ నిర్ణయాలు, పాలసీలు, విజిలెన్స్ నివేదికలు, స్టాఫ్ సర్వీస్, విభజన అంశాలు, కేంద్రంతో సంప్రదింపులు, కాలేజీలు, హాస్పిటల్స్ ఏర్పాటు వంటి కీలక 17 విషయాల ఫైల్స్ తనకు పంపాలన్నారు.
Similar News
News October 6, 2025
సత్తా చాటిన శ్రియాన్షి

తెలుగమ్మాయి శ్రియాన్షి వలిశెట్టి Al Ain Masters వరల్డ్ టూర్ సూపర్ 100 టోర్నీలో ఛాంపియన్‌గా నిలిచి సత్తాచాటారు. ఈమె పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో మాజీ ప్రపంచ జూనియర్ నంబర్‌వన్ తస్నిమ్ మీర్‌పై విజయం సాధించి టైటిల్ గెలుచుకున్నారు. దీంతో శ్రియాన్షికి 9,000 డాలర్ల ప్రైజ్‌మనీ, 5,500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
News October 6, 2025
BREAKING: రిజర్వేషన్లపై పిటిషన్ డిస్మిస్

TG: బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం 42శాతానికి పెంచడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. హైకోర్టులో విచారణలో ఉండగా సుప్రీంకు ఎందుకు వచ్చారని పిటిషనర్ గోపాల్‌రెడ్డిని ప్రశ్నించింది. అయితే HCలో స్టే ఇవ్వకపోవడంతో ఇక్కడికి వచ్చామని పిటిషనర్ తెలిపారు. దీంతో HCలో పెండింగ్‌లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని SC స్పష్టం చేసింది. కాగా ఎల్లుండి హైకోర్టులో విచారణ జరగనుంది.
News October 6, 2025
బీసీ రిజర్వేషన్ల జీవోపై సుప్రీంలో విచారణ ప్రారంభం

TG: స్థానిక ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో-9ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంలో విచారణ ప్రారంభమైంది. ప్రభుత్వం తరఫున లాయర్లు సింఘ్వీ, దవే వాదనలు వినిపిస్తున్నారు. విచారణ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి కూడా సుప్రీంకోర్టుకు వెళ్లారు.