News October 6, 2025
నకిలీ మద్యం తయారీలో వేళ్లని ఆయన వైపే?

ములకలచెరువు నకిలీ మద్యం తయారీలో మూల సూత్రధారి జయచంద్రారెడ్డి అంటూ సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. పీఏ రాజేశ్, ప్రధాన అనుచరుడు కట్టా సురేంద్ర నాయుడును ముందు పెట్టి వ్యవహారాలన్నీ ఆయననే నడిపించాడని టాక్ నడుస్తోంది. ఈ ఆరోపణలను టీడీపీలోని మరో వర్గం బలంగా చెప్తోంది. జయచంద్రారెడ్డి పాత్రపై ఎక్సైజ్ పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
Similar News
News October 6, 2025
HYDలో గుండెపోటుతో ACP విష్ణుమూర్తి మృతి

పుష్ప-2 తొక్కిసలాట ఘటనపై హీరో అల్లు అర్జున్‌కుహెచ్చరిక జారీ చేసిన ఏసీపీ సబ్బతి విష్ణుమూర్తి గుండెపోటుతో మరణించారు. సుదీర్ఘకాలం పాటు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో వివిధ హోదాల్లో సేవలందించిన ఆయన, HYDలోని తన నివాసంలో హార్ట్‌అటాక్‌కు గురై తుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు తెలిపారు.
News October 6, 2025
ప్రైవేట్ స్థలంలో శ్రీవారి ఆలయ నిర్మాణమా?: భూమన

కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ స్థలంలో శ్రీవారి ఆలయం నిర్మించాలనే TTD తీర్మానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ‘జీ-స్క్వేర్ నిర్మాణ సంస్థ ఆధీనంలో ఉన్న ఆ స్థలంపై ఈడీ విచారణ సాగుతోంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసమే టీటీడీ నిధులతో ఆ స్థలంలో ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. జీ-స్క్వేర్ సంస్థతో బీఆర్ నాయుడికి ఏమైనా లింకులా ఉన్నాయోమోనని మాకు అనుమానం వస్తోంది’ అని భూమన అన్నారు.
News October 6, 2025
సత్తా చాటిన శ్రియాన్షి

తెలుగమ్మాయి శ్రియాన్షి వలిశెట్టి Al Ain Masters వరల్డ్ టూర్ సూపర్ 100 టోర్నీలో ఛాంపియన్‌గా నిలిచి సత్తాచాటారు. ఈమె పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో మాజీ ప్రపంచ జూనియర్ నంబర్‌వన్ తస్నిమ్ మీర్‌పై విజయం సాధించి టైటిల్ గెలుచుకున్నారు. దీంతో శ్రియాన్షికి 9,000 డాలర్ల ప్రైజ్‌మనీ, 5,500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.