News October 6, 2025

నిజామాబాద్: సారీ… సర్పంచికి పోటీ చేయలేం

image

గతంలో సర్పంచిగా చేసి అప్పులపాలైన వారిని చూసిన విలేజ్ లీడర్స్ ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే జంకుతున్నారు. స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని సర్పంచులు సొంత ఖర్చులతో అభివృద్ధి పనులు చేపట్టారు. గ్రామీణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల నిధులు విడుదల కాకపోవడంతో అప్పులపాలయ్యారు. ఎన్నికల్లో అయ్యే ఖర్చుతో పాటు అభివృద్ధి పనులకు నిధులు విడుదల కాకపోతే పరిస్థితి ఏంటన్న చర్చ జోరుగా సాగుతోంది.

Similar News

News March 4, 2026

3 ముక్కల HYD.. ‘గ్రేటర్’ కథ కంచికే!

image

FEB 10తో GHMC కౌన్సిల్ పదవీకాలం ముగియడమే ఆలస్యం.. సర్కారు సిటీని 3 ముక్కలు చేస్తూ GO నం. 55 ఇచ్చేసింది. ఈ ముక్కలాట వెనుక అసలు కిటుకు వార్డుల పునర్విభజన. పాతబస్తీ పట్టు తగ్గించి కొత్త ఏరియాల్లో పొలిటికల్ పవర్ మార్చడమే అసలు ప్లాన్ అని విశ్లేషకులు అంటున్నారు. ఏటా రూ.2,000 కోట్ల ట్యాక్స్ కట్టే IT ఏరియా CYB కిందకి వెళ్లడంతో GHMC డెవలప్‌మెంట్ కోసం నిధులు ఎక్కడి నుంచి తెస్తారో? అన్నది సవాల్‌గా మారింది.

తిరుపతిలో 20 ఏళ్ల CM కల.. తీరేనా?

image

రుయాతోపాటు TTD పరిధిలోని స్విమ్స్, బర్డ్ ఆసుపత్రులను ఓకే గొడుగు కిందకు తేవడం CM చంద్రబాబు ఆలోచన. దీంతో యాత్రికులు, స్థానికులకు మెరుగైన వైద్యం అందిచవచ్చు. 20 ఏళ్లుగా ఈ ప్రతిపాదన ముందుకు కదలడం లేదు. TTD మాజీ EO అనిల్ ఇందుకు వ్యతిరేకత చూపినట్లు సమాచారం. రుయా సర్వీస్ రూల్స్, TTD సర్వీస్ రూల్స్ వేరు కావడం, సాంకేతిక, పాలన పరమైన అంశాలను ప్రధాన కారణంగా చెబుతున్నారు. మరోసారి CM దీనిని తెరపైకి తెచ్చారు.