News October 6, 2025
మెదక్: NMMS ఉపకార వేతనాలకు నేడే చివరి తేదీ

నేషనల్ మీన్స్ కం మెరిట్స్ స్కాలర్షిప్ (NMMS) ఉపకార వేతనాల దరఖాస్తుకు ఈనెల 6 చివరి తేదీ అని జిల్లా విద్యాధికారి రాధా కిషన్ తెలిపారు. ప్రభుత్వ, ZPHS, ఆదర్శ పాఠశాలలో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన వారికి ఏడాదికి రూ.12 వేల ఉపకార వేతనం ప్రభుత్వం అందిస్తుందని వెల్లడించారు. ఆసక్తి గల వారు www.bse.telangana.gov.in వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని సూచించారు.
Similar News
News October 6, 2025
మెదక్: జిల్లాను వదలని వాన.. భారీ వర్షం

మెదక్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. కొద్దిరోజులుగా వర్షాలు జిల్లాలో వదలడం లేదు. ఈరోజు ఉదయం 8:30 గంటలకు ఆటోమెటిక్ వెదర్ స్టేషన్‌లలో నమోదైన వర్షపాతం వివరాలు.. కొల్చారం 65.3 మిమీ, అల్లాదుర్గం 58.8, పెద్ద శంకరంపేట 57.0, మిన్పూర్ 47.3, టేక్మాల్ 46.3, లింగంపల్లి 44.8, చిన్న శంకరంపేట 44.5, బుజరంపేట 38.3, కౌడిపల్లి 34.5, చిట్కుల్ 22.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
News October 6, 2025
మెదక్: నేటి నుంచి కాలేజీలు ప్రారంభం

మెదక్ జిల్లాలో గత నెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు దసరా సెలవులు పూర్తి కావడంతో సోమవారం నుంచి అన్ని ఇంటర్ కళాశాలలు ప్రారంభం కానున్నాయని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మాధవి తెలిపారు. డీఐఈఓ మాట్లాడుతూ.. కళాశాలలో పరిసరాలను పరిశుభ్రం చేసిన తర్వాతనే విద్యార్థులను తరగతి గదులలో కూర్చోబెట్టాలని కళాశాలల ప్రిన్సిపాల్‌లకు ఆదేశించారు. విద్యార్థులు హాజరుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
News October 6, 2025
MDK: నేడు ఏడుపాయల క్షేత్రంలో పల్లకీ సేవ

మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల శ్రీ వన దుర్గాభవాని మాత క్షేత్రంలో సోమవారం పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6 గంటలకు పల్లకి సేవ నిర్వహించనున్నట్టు ఆలయ కార్యనిర్వాహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ పల్లకి సేవా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకను విజయవంతం చేయాలని కోరారు.