News October 6, 2025
యాక్షన్ దిశగా ప్రభుత్వం.. రెడీ అంటున్న విజయ్

కరూర్ తొక్కిసలాటపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహంతో తమిళనాడు ప్రభుత్వం విజయ్‌పై చర్యలకు సిద్ధమవుతోంది. నిందితుడిగా కేసు పెట్టడం, దుర్ఘటనకు కారకుడిగా చేయడం సహా ఇతర అంశాలు పరిశీలిస్తోంది. అటు ఏ నిర్ణయం తీసుకున్నా ఎదుర్కొనేందుకు సిద్ధమని TVK నేతల భేటీలో విజయ్ పేర్కొన్నారు. ‘41 మంది చనిపోతే సుమోటో కేసుతో ఇద్దరు కిందిస్థాయి నేతల అరెస్టులేనా? విజయ్‌పై చర్యలు తీసుకోరా? అని ప్రభుత్వాన్ని HC గతవారం ప్రశ్నించింది.
Similar News
News October 6, 2025
ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలివే

❂ అక్టోబర్ 8: మెయింటెనెన్స్ రిక్వైర్డ్(ప్రైమ్ వీడియో)
❂ అక్టోబర్ 9: వార్ 2(నెట్‌ఫ్లిక్స్-సినీ వర్గాల సమాచారం)
❂ అక్టోబర్ 10: మిరాయ్(జియో హాట్‌స్టార్)
❂ త్రిబాణధారి బార్బరిక్(సన్ నెక్స్ట్)
❂ స్థల్(జీ 5)
❂ స్విమ్ టు మీ(నెట్‌ఫ్లిక్స్)
News October 6, 2025
ఈ నెల 10న క్యాబినెట్ భేటీ

AP: వారం వ్యవధిలోనే మంత్రి వర్గం <<17905338>>మరోసారి<<>> సమావేశం కానుంది. ఈ నెల 10న సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ జరగనుంది. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశముంది.
News October 6, 2025
సత్తా చాటిన శ్రియాన్షి

తెలుగమ్మాయి శ్రియాన్షి వలిశెట్టి Al Ain Masters వరల్డ్ టూర్ సూపర్ 100 టోర్నీలో ఛాంపియన్‌గా నిలిచి సత్తాచాటారు. ఈమె పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో మాజీ ప్రపంచ జూనియర్ నంబర్‌వన్ తస్నిమ్ మీర్‌పై విజయం సాధించి టైటిల్ గెలుచుకున్నారు. దీంతో శ్రియాన్షికి 9,000 డాలర్ల ప్రైజ్‌మనీ, 5,500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.