News October 6, 2025

గజ్వేల్: సోషల్ పీజీటీ, టీజీటీ పోస్టుల దరఖాస్తులకు రేపే లాస్ట్ డేట్

image

గజ్వేల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ గర్ల్స్ మైనారిటీ పాఠశాలలో ఆయా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ సుధారాణి తెలిపారు. గర్ల్స్ స్కూల్‌లో టీజీటీ సోషల్, పీజీటీ సోషల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 7లోగా పాఠశాలలో దరఖాస్తు అందించాలని సూచించారు. మహిళా అభ్యర్థులకు మాత్రమే అవకాశం కల్పించామని తెలిపారు.

Similar News

News October 6, 2025

ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలివే

image

❂ అక్టోబర్ 8: మెయింటెనెన్స్ రిక్వైర్డ్(ప్రైమ్ వీడియో)
❂ అక్టోబర్ 9: వార్ 2(నెట్‌ఫ్లిక్స్-సినీ వర్గాల సమాచారం)
❂ అక్టోబర్ 10: మిరాయ్(జియో హాట్‌స్టార్)
❂ త్రిబాణధారి బార్బరిక్(సన్ నెక్స్ట్)
❂ స్థల్(జీ 5)
❂ స్విమ్ టు మీ(నెట్‌ఫ్లిక్స్)

News October 6, 2025

కురుపాం గురుకుల పాఠశాలను సందర్శించిన మంత్రి

image

కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అచ్చెంనాయుడు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసర ప్రాంతాలు, డైనింగ్ హాలు, కిచెన్ షెడ్, మరుగుదొడ్లను క్షుణంగా పరిశీలించారు. అనంతరం ఇద్దరు విద్యార్థులు మృతికి మిగతా విద్యార్థులు అనారోగ్యం బారిన పడడానికి గల కారణాలను పాఠశాల సిబ్బందికి అడిగి తెలుసుకున్నారు.

News October 6, 2025

వనపర్తి: ‘పోస్టర్ల ముద్రణలో నిబంధనలు పాటించాలి’

image

స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార పోస్టర్లు, కరపత్రాల ముద్రణలో ఎన్నికల కమిషన్ నిబంధనలను తప్పకుండా పాటించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎన్.ఖీమ్యా నాయక్ ప్రింటింగ్ ప్రెస్ యజమానులను ఆదేశించారు. జిల్లాలోని యజమానులతో ఆయన సమావేశమయ్యారు. ప్రచార సామగ్రిలో ఎక్కడా కులం, మతపరమైన అంశాలను ప్రస్తావించరాదని, అదేవిధంగా వ్యక్తిగత విమర్శలు లేకుండా చూసుకోవాలని ఆయన సూచించారు.