News October 6, 2025
విజయనగరంలో మద్యం దుకాణాలు బంద్

శ్రీ పైడితల్లమ్మ సిరిమానోత్సవం సందర్భంగా విజయనగరంలో మద్యం దుకాణాలు మూతబడ్డాయి. పట్టణంలో ఉన్న మొత్తం 14 మద్యం దుకాణాలతో పాటు 12 బార్లను నిన్న రాత్రి నుంచి అధికారులు మూసివేశారు. అలాగే జొన్నవలస, సుంకరిపేట, బియ్యాలపేటలో ఉన్న షాపులు కూడా మూతపడ్డాయి. సిరిమానోత్సవం పూర్తయిన తరువాత మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి షాపులు పునఃప్రారంభం కానున్నాయని సీఐ మన్మథరావు తెలిపారు.
Similar News
News March 7, 2026
కేయూలో రెండు రోజుల జాతీయ సదస్సు

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా, కాకతీయ విశ్వవిద్యాలయ సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో రెండు రోజుల జాతీయ సదస్సు ఈనెల 9, 10 తేదీలలో నిర్వహించనున్నారు. విశ్వవిద్యాలయ సెనెట్ హాల్‌లో “literature, leadership and innovation women shaping viksith bharat – 2047”, అనే అంశంపై ప్రముఖుల ప్రసంగాలు ఉంటాయని సంచాలకులు డాక్టర్ బి.దీపా జ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు,
News March 7, 2026
తాడికొండలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

తాడికొండలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. Nine One Exchange యాప్ ద్వారా బెట్టింగ్ చేస్తున్న కిరణ్, గోపీ, వంశీ, ప్రతాప్‌లను అదుపులోకి తీసుకుని 4 ఫోన్లు, కంప్యూటర్ సామగ్రి, ₹3,550 స్వాధీనం చేసుకున్నారు. తాడికొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 7, 2026
నేటితో ముగియనున్న ఎర్రగట్టుగుట్ట జాతర బ్రహ్మోత్సవాలు

హసన్‌పర్తి మండలం భీమారంలో గత 5 రోజులుగా అంగరంగ వైభవంగా కొనసాగిన ప్రసిద్ధ శ్రీ ఎర్రగట్టుగుట్ట జాతర బ్రహ్మోత్సవాలు శనివారం సాయంత్రంతో ఘనంగా ముగియనున్నాయి. ముగింపు రోజున భక్తులు భారీ సంఖ్యలో జాతరకు తరలి రావడంతో జాతర ప్రాంగణం భక్తజనంతో కిటకిటలాడింది. భక్తులకు జాతరలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో ఎన్.వెంకట్రావు, ఆలయ ఛైర్మన్ మార్క రాజు, ధర్మకర్తలు, పోలీసులు తగు చర్యలు చేపట్టారు.


