News October 6, 2025
ADB: టికెట్ కోసం పోరు.. పార్టీ లీడర్లకు పెద్ద సవాలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక బడా నేతలకు సవాలుగా మారింది. సర్పంచ్ స్థానానికి ఇద్దరేసి, జడ్పీటీసీ స్థానానికి ముగ్గురు, నలుగురు తమకే టికెట్ ఇవ్వాలంటూ పార్టీ అధిష్ఠానం వెంట పడుతున్నారు. భీంపూర్, ఉట్నూర్, బేల, భోరజ్, జైనథ్, సాత్నాల మండలాల్లో భారీగా పోటీ ఉండటంతో అన్ని పార్టీల జిల్లా నేతలకు తలపోటుగా మారింది. ఒకరికి టికెట్ ఇస్తే మరో ఇద్దరు వ్యతిరేకంగా వ్యవహరిస్తారనే భయం పట్టుకుంది.
Similar News
News March 22, 2026
రైతుల కోసం టెలీ-మానస్ హెల్ప్ లైన్ : ADB కలెక్టర్

మానసిక ఒత్తిడితో బాధపడుతున్న రైతులు, వారి కుటుంబసభ్యులు ప్రభుత్వం అందిస్తున్న టెలీ-మానస్ (Tele-MANAS) హెల్ప్‌లైన్ 14416 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఈ నంబర్‌కు కాల్ చేసి నిపుణులైన కౌన్సిలర్ల ద్వారా ఉచిత సలహాలు పొందవచ్చని తెలిపారు. గ్రామ స్థాయిలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఈ సేవలపై అవగాహన కల్పిస్తున్నారని పేర్కొన్నారు. రైతులు మానసిక ఒత్తిడికి గురికావద్దన్నారు.
News March 21, 2026
నార్నూర్: రూ.2,40,000 విలువగల గంజాయి స్వాధీనం

నార్నూర్ మండలంలోని మాలేపూర్‌లో సాగు చేస్తున్న గంజాయి తోటపై శనివారం పోలీసులు దాడి చేశారు. సీఐ ప్రసాద్, SI శ్రీసాయి వివరాల ప్రకారం.. మాలేపూర్‌కు చెందిన బాలాజీ తన వ్యవసాయంలో గంజాయి సాగు చేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మొత్తం 24 మొక్కలు స్వాధీనం చేశారు. దాని విలువ రూ.2,40,000 ఉంటుందని అంచనా వేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News March 21, 2026
వారికి ఆదిలాబాద్ కలెక్టర్ హెచ్చరిక..!

ప్రభుత్వం రాయితీపై గృహ అవసరాలకు అందిస్తున్న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లించడం చట్టరీత్యా నేరమని కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. జిల్లాలో అక్రమ గ్యాస్ వినియోగాన్ని అరికట్టేందుకు విజిలెన్స్ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాయన్నారు.


