News October 6, 2025

ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన విజయవాడ రైల్వే డివిజన్

image

VJA రైల్వే డివిజన్ OCT 4న రూ. 5కోట్ల ఆదాయాన్ని ఆర్జించి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఒకేరోజులో ఈ స్థాయిలో ఆదాయం సాధించిన తొలి డివిజన్‌గా విజయవాడ నిలిచింది. ఆరోజు డివిజన్ పరిధిలో 2.80లక్షల మంది ప్రయాణం సాగించారని DRM మోహిత్ సోనాకియా తెలిపారు. శనివారం ఒక్కరోజునే 80వేలకుపైగా ప్రయాణికులు VJA స్టేషన్ నుంచే రాకపోకలు సాగించగా, రూ.2కోట్ల ఆదాయం ఈ స్టేషన్ నుంచే వచ్చిందన్నారు.

Similar News

News April 1, 2026

కొండగట్టు ఘటనపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందన

image

కొండగట్టులో చిన్న జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన చలువ పందిరి కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పలువురు నాయీబ్రాహ్మణులు గాయపడగా, ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. గాయపడిన వారికి ప్రభుత్వం ఉచిత చికిత్స అందించాలని, ప్రతి బాధితుడికి రూ.20 లక్షల ఆర్థిక సాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేవదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలని అన్నారు.

News April 1, 2026

అల్లూరి: 95 శాతం ఇంటి పన్నులు వసూలు

image

అల్లూరి, పోలవరం జిల్లాల్లో 95 శాతం గ్రామాల్లో ఇంటి పన్నులు వసూలు చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్ రావు బుధవారం తెలిపారు. రెండు జిల్లాల్లో మొత్తం 430 పంచాయతీలు ఉండగా 412 పంచాయతీల్లో రూ.12 కోట్లు పన్నులు వసూలు చేశామన్నారు. మిగిలిన గ్రామాల్లో 2 రోజుల్లో వసూళ్లు పూర్తి చేసి జిల్లాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

News April 1, 2026

సంక్షేమ పథకాలపై ప్రజాభిప్రాయాన్ని మెరుగుపరచాలి: కలెక్టర్

image

ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో జిల్లాలకు, అధికారులకు ర్యాంకింగ్‌లు ఇస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ప్రజాభిప్రాయం పెంపుపై సమీక్ష నిర్వహించారు. అన్ని సంక్షేమ పథకాలలో కనీసం 80శాతం నుంచి గరిష్ఠంగా 95 వరకు సంతృప్తి శాతం పెంచాలన్నారు.