News October 6, 2025

నెల్లూరు: బాలికపై లైంగిక దాడి.. పోక్సో కేసు నమోదు

image

ప్రేమిస్తున్నానని వెంటపడి పదో తరగతి బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో శశి అనే యువకుడిపై సంతపేట పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బాలికను ఓ దుకాణంలో పనిచేసే శశి ప్రేమ పేరుతో వెంటపడేవాడు. బాలికను బైక్‌పై ఎక్కించుకొని తన పిన్ని ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడే ఆమెపై బలత్కారం చేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అతడిపై సీఐ రామారావు పోక్సో కేసు నమోదు చేశారు.

Similar News

News March 20, 2026

నెల్లూరు: పెళ్లికి వెళ్తుండగా యాక్సిడెంట్.. ఒకరి స్పాట్ డెడ్

image

బైకును కంటైనర్ ఢీకొని యువకుడు దుర్మరణం చెందిన ఘటన మనుబోలు హైవేపై చోటుచేసుకుంది. ఎస్సై శివ రాకేశ్ కథనం మేరకు.. కలువాయికి చెందిన శెట్టి పల్లి రమేశ్ (40) బైక్‌పై మల్లాంలో జరగబోయే వివాహానికి వెళుతుండగా చెన్నై వైపు వెళ్తున్న కంటైనర్ లారీ ఢీకొంది. ఈప్రమాదంలో రమేశ్ అక్కడక్కడే మృతి చెందాడు. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 20, 2026

నెల్లూరు: 10వ తరగతి ఇంగ్లీష్ పరీక్ష ఏప్రిల్ 2కు వాయిదా

image

పదో తరగతి పరీక్షలులో భాగంగా శనివారం 21వ తేదీన జరగాల్సిన ఇంగ్లీష్ పరీక్ష వాయిదా పడినట్లు ఉదయగిరి ప్రాంత పరీక్షల నిర్వహకులు తోట శ్రీనివాసులు ఒక ప్రకటన తెలిపారు. 21వ తేదీన ఈద్ – ఉల్ – ఫితర్ (రంజాన్ ) పర్వదినం రావడంతో ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ పరీక్షను ఏప్రిల్ 2వ తేదీన ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

News March 20, 2026

నెల్లూరులో దొంగల ముఠా అరెస్ట్

image

నెల్లూరులో ప్రభుత్వ ఆస్తులను దొంగలిస్తున్న ముఠాను చిన్నబజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాత జూబ్లీ హాస్పిటల్ రోడ్డులోని BSNL కార్యాలయంలో కిటికీ రాడ్లు తొలగించి చొరబడి దొంగతనం చేశారు. నిందితులు చెన్నంశెట్టి కుమార్(ముత్తుకూరు ఇందిరమ్మ కాలనీ), దీపాల వెంకయ్య(రాజుపాలెం, కొడవలూరు), అరవ ఖలీ(వేదాయపాలెం)గా గుర్తించారు. మూలాపేటలో అరెస్ట్ చేసి వారి నుంచి 40 మీటర్ల రాగి వైరు స్వాధీనం చేసుకున్నారు.