News October 6, 2025
అధిక వర్షాలు.. కూరగాయ పంటల్లో జాగ్రత్తలు

భారీ వర్షాల సమయంలో పొలంలో నిలిచిన నీటిని సాధ్యమైనంత త్వరగా బయటకు పంపేలా చూసుకోవాలి. లేకుంటే పంటకు తీవ్ర నష్టం జరుగుతుంది. వర్షాలు ఆగిన వెంటనే 19:19:19 లేదా 13:0:45 లేదా యూరియా వంటి పోషకాలను వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంటపై పిచికారీ చేయాలి. అధిక వర్షాలతో విత్తనం మొలకెత్తనప్పుడు లేదా లేత మొక్కలు దెబ్బతిన్నప్పుడు నర్సరీలోనే నారు పెంచుకోవాలి. అంతర సేద్యం చేసి కలుపును తొలగించాలి.
Similar News
News October 6, 2025
అన్ని ఫార్మాట్లలో హర్షిత్ రాణా.. ఎందుకో?

ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే, టీ20 స్క్వాడ్‌లో పేసర్ హర్షిత్ రాణాకు చోటు ఇవ్వడంపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. IPLలో KKR తరఫున ఆడటం వల్లే హెడ్ కోచ్ గంభీర్ అతడికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఫైర్ అవుతున్నారు. పర్ఫార్మెన్స్ గొప్పగా లేకపోయినా మూడు ఫార్మాట్లలో ఎందుకు కంటిన్యూ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. షమీ, సిరాజ్ లాంటి బౌలర్లు కనిపించట్లేదా అని నిలదీస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
News October 6, 2025
దీపావళి కానుక.. అకౌంట్లలోకి రూ.2వేలు?

21వ విడత PM కిసాన్ నిధుల విడుదలకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీపావళి కానుకగా మరో వారంలో అన్నదాతల అకౌంట్లలో ₹2K చొప్పున జమ చేయనుందని నేషనల్ మీడియా పేర్కొంది. EKYC, ఆధార్-బ్యాంక్ లింకు కాలేదంటే వెంటనే పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
* ప్రతిరోజూ పంటల్లో చీడపీడల నివారణ, కొత్త విధానాలు, పాడి, జీవాలకు సంబంధించిన కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> కేటగిరీకి వెళ్లండి.
News October 6, 2025
ఫ్రాన్స్ ప్రధాని రాజీనామా

ఫ్రాన్స్ ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను నెల రోజుల్లోనే తన పదవికి రాజీనామా చేశారు. ఆయన నియమించిన క్యాబినెట్‌పై విమర్శలు రావడంతో పదవి నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. అంతకుముందు ప్రధానిగా ఫ్రాంకోయిస్ బయ్రూ అవిశ్వాసతీర్మానంలో ఓటింగ్ ద్వారా పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే.