News October 6, 2025
మెదక్: జిల్లాను వదలని వాన.. భారీ వర్షం

మెదక్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. కొద్దిరోజులుగా వర్షాలు జిల్లాలో వదలడం లేదు. ఈరోజు ఉదయం 8:30 గంటలకు ఆటోమెటిక్ వెదర్ స్టేషన్‌లలో నమోదైన వర్షపాతం వివరాలు.. కొల్చారం 65.3 మిమీ, అల్లాదుర్గం 58.8, పెద్ద శంకరంపేట 57.0, మిన్పూర్ 47.3, టేక్మాల్ 46.3, లింగంపల్లి 44.8, చిన్న శంకరంపేట 44.5, బుజరంపేట 38.3, కౌడిపల్లి 34.5, చిట్కుల్ 22.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
Similar News
News October 7, 2025
మెదక్: ‘గ్రామాల్లో రహస్య ప్రచారాలు’

స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం అడుగు వేయడంతో గ్రామాల్లో రహస్య ప్రచారాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం 42శాతం రిజర్వేషన్ తీసుకురావడంతో హైకోర్టు తీర్పు 8కి వాయిదా వేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పు కోసం పలువురు ఆశవహులు ఎదురు చూస్తున్నారు. తీర్పు అనంతరం ప్రచారాలు గ్రామాల్లో జోరు అందుకోనుంది. ఇప్పటికే గ్రామాల్లో కొందరు రహస్య ప్రచారం చేస్తున్నారు. మీ ప్రాంతాల్లో ఎలా ఉంది?
News October 7, 2025
పాపన్నపేట: వ్యాపార విభేదాలతోనే హత్య.. నలుగురి అరెస్టు

పాపన్నపేట మండలం నాగసాన్‌పల్లిలో యువకుడి హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు మెదక్ రూరల్ సీఐ జార్జ్ తెలిపారు. వ్యాపార విభేదాల కారణంగానే ఆదివారం రాత్రి మహబూబ్‌ను హత్య చేశారని పేర్కొన్నారు. ఏడుపాయల బ్రిడ్జి వద్ద మహబూబ్‌పై ఉద్దేశపూర్వకంగా కర్ర విట్టల్, విటల్ భార్య రాజమణి, కొడుకులు యాదగిరి, మహేష్ దాడి చేయడంతో మృతి చెందినట్లు వివరించారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు సీఐ వివరించారు.
News October 6, 2025
ఈనెల 12 వరకు సమాచార హక్కు చట్టం వారోత్సవాలు: కలెక్టర్

ఈనెల 12 వరకు సమాచార హక్కు చట్టం వారోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సమాచార హక్కు చట్టం 2005, ప్రభుత్వ అధికారుల పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఒక మైలురాయి చట్టంగా ఉందని తెలియజేశారు. ముఖ్యమైన చట్టం అమలులోకి వచ్చినందుకు ప్రభుత్వం నుంచి సమాచారం పొందే హక్కు గురించి పౌరుల్లో అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.