News October 6, 2025
జూపాడుబంగ్లాలో వాన బీభత్సం.. కూలిన ఇళ్లు

జూపాడు బంగ్లాలోని 80- బన్నూరులో ఆదివారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి హర్ష పోగు జయన్నకు చెందిన ఇళ్లు కూలిపోయింది. అయితే ప్రమాదం జరిగినటప్పుడు జయన్న భార్య, కొడుకు ఇంటి బయట ఉండడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. పేదవాడైన తనకు అధికారులు స్పందించి ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.
Similar News
News October 6, 2025
HYD: మల్లేశ్‌కు ఉద్యోగం కల్పించిన NIMS డైరెక్టర్

ఎత్తు తక్కువ కారణంగా ఎక్కడా ఉద్యోగం దొరకక ఇబ్బంది పడుతున్న శంషాబాద్ వాసి మరుగుజ్జు మల్లేశ్‌కు NIMS డైరెక్టర్ ప్రొ.నగరి బీరప్ప అండగా నిలిచారు. తన బాధ విన్న ఆయన, మల్లేశ్‌కు ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్చి వెంటనే లిఫ్ట్ ఆపరేటర్‌గా నియామకపత్రం అందజేశారు. దీంతో మల్లేశ్ ఆనందం వ్యక్తం చేస్తూ, తన జీవితానికి కొత్త ఆశ కలిగించిన బీరప్పకి కృతజ్ఞతలు తెలిపాడు.
News October 6, 2025
రొమ్ము క్యాన్సర్ కచ్చితంగా తగ్గుతుంది: డా.విశాల్

మహిళల్లో రొమ్ము క్యాన్సర్ తగ్గదనేది అపోహ మాత్రమేనని హేమాటో ఆంకాలజిస్ట్ డా.విశాల్ టోకా స్పష్టం చేశారు. ‘తొలి దశలో ఆంకో ప్లాస్టీ అనే శస్త్రచికిత్సతో రొమ్మును రక్షిస్తూ క్యాన్సర్‌ను ఇతర అవయవాలకు వ్యాపించకుండా ఆపవచ్చు. రెండో దశలోనూ పూర్తిగా తగ్గించవచ్చు. 3, 4 దశల్లో ఆపరేషన్, రేడియేషన్, హార్మోనల్ థెరపీ, కీమోథెరపీ వంటి చికిత్సల అవసరం పడవచ్చు. కచ్చితంగా క్యాన్సర్ తగ్గుతుంది’ అని పేర్కొన్నారు.
News October 6, 2025
రొమ్ము క్యాన్సర్: స్వీయ పరీక్షతో అడ్డుకట్ట

ప్రతి మహిళా టీనేజీ నుంచే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలని హేమాటో ఆంకాలజిస్ట్ విశాల్ టోకా వెల్లడించారు. ‘రొమ్ముల్ని తాకినప్పుడు గడ్డలు తెలిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. బ్రెస్ట్ ఆకృతిలో మార్పులు కనిపించినా, చంకల్లో గడ్డ కనిపించినా నొప్పి లేదని తేలిగ్గా తీసుకోవద్దు. బ్రెస్ట్‌పై దద్దుర్లు, నిపుల్స్ ముడుచుకున్నట్లుగా లోపలివైపునకు ఉన్నా, రక్తస్రావం ఉన్నా డాక్టర్‌ను సంప్రదించాలి’ అని చెప్పారు.