News October 6, 2025

ADB: ప్రచారం వారమే.. ఓటర్ల మనసు గెలవాలి..!

image

స్థానిక సంస్థల్లో మండల, జిల్లా పరిషత్ తొలిదశ ఎన్నికలకు ఈనెల 9న నోటిఫికేషన్ విడుదల కానుంది. ప్రకటన వెలువడిన రోజు నుంచి మూడు రోజుల్లో నామినేషన్ల దాఖలు చేయాలి. ఇక ఉపసంహరణలు పూర్తయ్యాక పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారం చేయడానికి కేవలం వారమే ఉంటుంది. ఈ వారంలో వారి ప్రచారం, ప్రణాళికను బట్టి ఓట్లు వస్తాయి. తొందరపాటులో చేసిన తప్పు ప్రత్యర్థికి పాజిటివ్‌గా మారవచ్చు. నిబంధనలు దాటకుండా ప్రచారం చేస్తేనే మేలు.

Similar News

News October 6, 2025

మస్క్ సంస్థకు US ఆర్మీ రూ.6K Cr కాంట్రాక్టు

image

స్పేస్ ఎక్స్ సంస్థ భారీ US మిలిటరీ కాంట్రాక్టు పొందింది. వచ్చే ఆర్థిక సం.లో ఆర్మీ చేపట్టే 7 కీలక రాకెట్ లాంచ్‌లలో 5 మస్క్ సంస్థకు దక్కాయి. నేషనల్ సెక్యూరిటీ స్పేస్ లాంచ్ ప్రోగ్రాం(NSSL) కింద జరిగిన ఈ ఒప్పంద విలువ $714 మిలియన్లు (₹6,339 కోట్లు). ట్రంప్-మస్క్ మధ్య చెడిన మైత్రి మళ్లీ కుదిరాక ఇది జరగడం గమనార్హం. ఇక అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజన్ సంస్థకు అర్హతలు లేవని కాంట్రాక్ట్ ఇవ్వలేదు.

News October 6, 2025

NLG: అభ్యర్థుల కోసం అన్వేషణ.. పార్టీల వ్యూహాలు

image

నల్గొండ జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. మెజారిటీ సాధించేందుకు బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఈ క్రమంలో 33 జెడ్పీటీసీ, 353 ఎంపీటీసీ, 33 ఎంపీపీ స్థానాల నుంచి పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల పేర్లను సేకరించే పనిలో ప్రధాన పార్టీలు నిమగ్నమయ్యాయి. ఎన్నికల కోసం ఆశావహులు ఉత్సాహం చూపుతున్నారు.

News October 6, 2025

వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్

image

2025కు సంబంధించి వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి ప్రకటించారు. రోగనిరోధక శక్తిపై పరిశోధనలకు గాను మేరీ బ్రాంకౌ (అమెరికా), ఫ్రెడ్ రామ్స్‌డెల్ (అమెరికా), షిమన్ సకాగుచి (జపాన్)లకు నోబెల్ ప్రైజ్‌లు వచ్చాయి.