News October 6, 2025

టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్.. ఫ్రీగా పంపిస్తున్నారా?

image

సొంతూళ్లకు వెళ్లి మహానగరానికి తరలివస్తోన్న వారితో HYD శివారు హైవేలపై భారీగా <<17927176>>ట్రాఫిక్ జామ్<<>> అవుతోంది. టోల్‌ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర క్యూ ఉంటోంది. అలాంటి సమయంలో వాహనాలను టోల్ లేకుండా పంపాలని NHAI నిబంధనల్లో ఉంది. క్యూ లైన్ 100మీటర్ల పసుపు గీతను దాటినా.. సాంకేతిక సమస్యలతో వాహనం 10 సెకన్ల కంటే ఎక్కువ వేచి ఉన్నా ఉచితంగా వెళ్లొచ్చు. ఇవి ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఉద్దేశించినవి.

Similar News

News October 6, 2025

1.21 కోట్ల మంది మహిళల ఖాతాల్లో రూ.10 వేలు

image

‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ పథకం కింద బిహార్ CM నితీశ్ మరో 21 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10 వేలు జమ చేశారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు NDA ప్రభుత్వం ఈ స్కీమ్‌ ప్రారంభించింది. తొలి విడతలో 75 లక్షల మందికి, రెండో విడతలో 25 లక్షల మందికి సాయమందించింది. ఇప్పటివరకు 1.21 కోట్ల మంది లబ్ధి పొందారు. ఈ డబ్బును సద్వినియోగం చేసుకున్న వారికి ప్రభుత్వం రూ.2 లక్షల వరకు సాయం అందించనుంది.

News October 6, 2025

మస్క్ సంస్థకు US ఆర్మీ రూ.6K Cr కాంట్రాక్టు

image

స్పేస్ ఎక్స్ సంస్థ భారీ US మిలిటరీ కాంట్రాక్టు పొందింది. వచ్చే ఆర్థిక సం.లో ఆర్మీ చేపట్టే 7 కీలక రాకెట్ లాంచ్‌లలో 5 మస్క్ సంస్థకు దక్కాయి. నేషనల్ సెక్యూరిటీ స్పేస్ లాంచ్ ప్రోగ్రాం(NSSL) కింద జరిగిన ఈ ఒప్పంద విలువ $714 మిలియన్లు (₹6,339 కోట్లు). ట్రంప్-మస్క్ మధ్య చెడిన మైత్రి మళ్లీ కుదిరాక ఇది జరగడం గమనార్హం. ఇక అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజన్ సంస్థకు అర్హతలు లేవని కాంట్రాక్ట్ ఇవ్వలేదు.

News October 6, 2025

వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్

image

2025కు సంబంధించి వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి ప్రకటించారు. రోగనిరోధక శక్తిపై పరిశోధనలకు గాను మేరీ బ్రాంకౌ (అమెరికా), ఫ్రెడ్ రామ్స్‌డెల్ (అమెరికా), షిమన్ సకాగుచి (జపాన్)లకు నోబెల్ ప్రైజ్‌లు వచ్చాయి.