News October 6, 2025
బిహార్ అసెంబ్లీ ముఖచిత్రం చూస్తే..

UP, బెంగాల్, మహారాష్ట్ర తర్వాత నాలుగో అత్యధిక అసెంబ్లీ స్థానాలు(243)న్న బిహార్‌కు ఇవాళ సాయంత్రం గం.4కు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. 2020 ఎన్నికల్లో NDA 125, INDIA 110, ఇతరులు 8 స్థానాలు పొందాయి. ఓటుబ్యాంకు: NDA 37.26%, INDIA 37.23%. 20% స్థానాల్లో గెలుపు-ఓటముల తేడా 2.5%లోపే. NDA ఇలా 21, INDIA 22 సీట్లు పొందాయి. రెండు కూటముల మధ్య పోటీతో వేవ్ స్వింగ్ అయ్యే ఈ సీట్లే అధికారాన్ని నిర్ణయిస్తాయి.
Similar News
News October 6, 2025
ఆకాశం నుంచి బంగారు వర్షం.. ఎప్పుడంటే?

రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో 1944, ఏప్రిల్ 14న ముంబైలోని విక్టోరియా డాక్‌లో భారీ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి బ్రిటన్ నౌక ‘ఫోర్ట్ స్టికిన్’ తునాతునకలైంది. దీంతో అందులోని 3,50,000 కిలోల బంగారు బిస్కెట్లు గాల్లోకి ఎగిరి వర్షంలా కురిశాయి. వందల మీటర్ల దూరంలో ఇవి ఎగిసిపడటంతో ప్రజలు వీటికోసం పరుగులు తీశారు. అయితే ఓడలో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలుండటంతో భారీ విస్పోటనం జరిగి 800 మందికి పైగా చనిపోయారు.
News October 6, 2025
APPLY NOW: IUCTEలో ఉద్యోగాలు

ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (IUCTE) 10 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు నవంబర్ 10 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు కలదు. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: www.iucte.ac.in
News October 6, 2025
అనంత శక్తికి చిహ్నం ‘8’ సంఖ్య

‘8’ సంఖ్యకు అపారమైన గొప్పతనం ఉంది. సృష్టిలో 8 దిక్కులు గలవు. వాటిని మోసేది అష్ట దిగ్గజాలు. శుభాలు, సంపదలు ప్రసాదించేవారు అష్ట లక్ష్ములు. మోక్ష మార్గానికి దారి చూపేవి అష్టాంగాలు. ఈ సంఖ్య శివుని అష్ట మూర్తులను, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్ట దిగ్గజాలను, దశరథుని అష్ట మంత్రులను సూచిస్తుంది. జన్మహేతు, దుష్ట లక్షణాలు, ధర్మాలు కూడా ఎనిమిదే. ఈ సంఖ్య అదృష్ట సూచకమని పండితులు చెబుతున్నారు. <<-se>>#Sankhya<<>>